దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ పెరిగిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న భయపడే రోజులు వచ్చేసాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.. దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసొస్తుంది అనే చెప్పాలి. అయితే ఈ ఆహార కల్తీ ఎక్కువగా ఉండేది ఆన్ లైన్ సర్వీసులలోనే అంట. 


ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ మొదలై ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయ్యింది. అయితే మొదట్లో ఎక్కువ ధర ఉన్న ఈ ఫుడ్ ఆర్డర్ ఇప్పుడు చాలా తక్కువ ధరలకే ఫుడ్ ఆర్డర్ అవుతుంది. దీంతో ఎవరైనా ఎక్కడ నుండి అయినా అతి తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు తక్కువ ధరకు వస్తుందో తెలుసా ? అసలు ఎప్పుడైనా రోజు రోజుకు ధరలు పెరుగుతాయి కానీ తగ్గవు.. 


కానీ ఆన్లైన్ ఆర్డర్ లో మొదట ఎక్కువ ధర ఉండి ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ వస్తుంది.  అయితే ఫుడ్ ఆర్డర్ తక్కువ ధరకు వచ్చినట్టే నాణ్యత కూడా అలాగే తగ్గిపోయింది. ఒకటికి నాలుగు ఫుడ్ ఆర్డర్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకదానిలో ఎక్కువ మరొక దానిలోకి వెళ్లే సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆకట్టుకునే విధంగా ఆఫర్లు ఇస్తారు. 


అవి నాణ్యత తక్కువ, పాచిపోయినవి, పాడైపోయినవి వేడి చేసి మనకు ఫుడ్ ఆర్డర్ లో పంపిస్తారు. ఇంకా చెప్పాలంటే చికెన్ బిర్యానీ బదులు కుక్కలా బిర్యానీ ఆలా పంపిన ఘటనలు కూడా చాల ఉన్నాయి. నిజానికి చాల ఫుడ్ ఆర్డర్ యాప్స్ తక్కువ ధరకే ఫుడ్ వచ్చేలా చేస్తాయి.. కానీ నాణ్యత లేని ఫుడ్ వస్తుంది. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ ఫుడ్ వెంటనే ఎఫెక్ట్ చూపించాదు.. కానీ కచ్చితంగా ఇది ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ అపి ఇంట్లో వంట తినడం మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: