సాధారణంగా ఒక మనిషి శరీరానికి రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీళ్లు అవసరం. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే ఆరోగ్యం పది కాలాలపాటు బాగుంటుంది. శరీరంలో మినరల్స్, విటమిన్లు అవయవాలకు సరఫరా చేయటంలో నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. తరచుగా నోరు ఆరిపోతున్నా, చెమట పట్టకపోయినా, కళ్లు పొడిబారినా, ఎర్రగా మారినా సరిగా నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. 
 
శరీరంలో తగినంత నీటి శాతం లేకపోతే చర్మ సమస్యలు, చర్మం ముడతలు పడటం వంటివి జరుగుతాయి. తక్కువ నీటిని తాగడం వలన కిడ్నీ సమస్యలు వస్తాయి. తగినంత నీళ్లు తాగడం ద్వారా మెరిసే జుట్టుతో పాటు యవ్వనమైన చర్మాన్ని కూడా పొందవచ్చు. తక్కువగా నీళ్లు తాగితే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో పాటు మలబద్ధకానికి సంబంధిన సమస్యలు కూడా నీళ్లు తక్కువగా తాగే వారిలో వస్తాయి. 
 
తగినంత నీళ్లు తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోవడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు ఏర్పడవు. యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉందంటే శరీరానికి తగినంత నీళ్లు తాగటం లేదని అర్థం చేసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీళ్లను తాగినా ఎటువంటి నష్టం లేదు. శరీరానికి తగినంత నీళ్లు తాగకపోతే కీళ్ల నొప్పులు కూడా మొదలవుతాయి. శరీర బరువు తగ్గాలనుకునేవారు అన్నం తినడానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి. గ్లాసు మంచినీళ్లు తాగడం వలన ఆకలి తగ్గుతుంది. 
 
శరీరానికి తగినంత నీళ్లు తాగేవారిలో కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నీళ్లు బాగా తాగడం వలన జాయింట్లు బలిష్టంగా , ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. నీళ్లు బాగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. నీళ్లు తక్కువగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: