కల్తీ ఈ పదం ఇప్పుడు ఎంత ఈజీగా వాడుతున్నారు అంటే ఎదో ఊతపదం వాడినట్టుగా వాడుతున్నారు.  ప్రపంచంలో మనిషి జీవించడానికి అవసరమైన అన్ని కూడా కల్తీ అవుతున్నాయి.  మనిషి బ్రతకాలి అంటే గాలి, నీరు కావాలి.  నీరు ఎప్పుడో కల్తీ అయ్యింది.  నీళ్లలో ఉండాల్సిన మూలకాలకంటే వేరే మూలకాలు ఎక్కువుగా ఉంటున్నాయి.  మనం భూమిపై ఉపయోగించే చెత్తను భూమిలో కలిపేస్తున్నారు.  ఈ చెత్త కారణంగా, ఆ చెత్త నుంచి వెలువడే విషయం మూలకాల కారణంగా భూమి కలుషితం అవుతున్నది.  


భూమి లోపల కలుషితం కావడం వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.  ఆ నీటిని తాగిన మనుషులు రోగాల బారిన పడుతున్నారు.  అంతుచిక్కని వ్యాధులు మనుషుల్ని ఇబ్బందులు పెడుతున్నాయి.  ఇలా వచ్చే వ్యాధులు అటు వైద్యులకు పెను సవాల్ గా నిలుస్తున్నాయి.  ఒకప్పుడు క్యాన్సర్, ఆ తరువాత హెచ్ఐవి, హార్ట్ ఎటాక్, ఇపుడు డెంగ్యూ వ్యాధులు మనుషులను ఇబ్బందులు పెడుతున్నాయి.  


ఈ డెంగ్యూ కారణంగా మనుషులు మరణిస్తున్నారు.  ఇక మనం పీల్చే గాలి సైతం కలుషితం అవుతున్నది.  ఈ గాలి కలుషితం కావడంతో మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నారు.  కలుషితమైన గాలిని పీల్చి ఊపిరితిత్తుల సమస్యలతో మృత్యువాత పడుతున్నారు.  ఇదిలా ఉంటె, నీరు, గాలి మాత్రమే కాదు.. ఇప్పుడు రక్తం కూడా కలుషితం అవుతున్నది.  ఇప్పటి వరకు కలుషితం కాకుండా దొరికింది ఇదొక్కటే..


రక్తాన్ని బయట తయారు చేయలేరు.  అందుకే కలుషితం కాలేదు.  మనిషి తలచుకుంటే తయారు చేయలేనిది ఏముంటుంది చెప్పండి.  కృత్రిమంగా ప్రయోగశాలలో బ్లడ్ ప్లేట్ లెట్స్ ను ఇటీవలే శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.  ఈ రకంగా తయారు చేసిన ప్లేట్ లెట్స్ చక్కగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయోగ దశలో ఉన్న ఇది బయటకు వచ్చి అందరికి అందుబాటులోకి వస్తే.. ఈ ప్లేస్ లెట్స్ కు మార్కెట్ లో డూప్లికేట్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.  అదే జరిగితే..మనిషి మరణం ఎంత వేగంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: