ప్రస్తుత రోజులలో  ఎక్సర్‌సైజ్‌లు  చాల మంది చేస్తూనే ఉంటారు. అలంటి వారికోసం ఈ ఎక్సర్‌సైజ్‌ వార్మప్ గురించి కొన్ని విషయాలు.  ఎక్సర్‌సైజ్‌లు చేసే ముందు వెనుక చేసే వార్మప్‌ గురించి తెలుసుకుందామా మరి..... 


ఎక్సర్‌సైజ్‌కు ముందు..వెనుక....
ఎక్సర్‌సైజ్‌ ముందూ తర్వాతా వార్మప్‌ చేయడం ద్వారా శరీరం ఒత్తిడికి లోనవదు. మనం ఎంత సమయం వర్కవుట్స్‌ చేస్తామనేది వార్మప్‌ మీద ఆధారపడి ఉంటుంది. వార్మప్‌లో భాగంగా సులువుగా, సౌకర్యంగా ఉండే బ్యాక్‌ స్ట్రెచ్, తొడ భాగం ముందుకు వంచడం వంటివి చేయాలి. పరిగెత్తడానికి ముందు జాగింగ్‌, సైక్లింగ్‌ వంటివి వామప్‌గా ఉపయోగపడతాయి.
 
వార్మప్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలు కూడా చాల ఉన్నాయి.  వాటి వివరాల్లోకి వెళ్తే ..వార్మప్‌ ఎక్సర్‌సైజ్స్‌ చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.  వార్మప్‌ వల్ల కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాల్లో వేడి పుడుతుంది. దాంతో మరింత ఉత్సాహంగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు.  వార్మప్‌ చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దాంతో ఎక్సర్‌సైజ్‌ సమయంలో క్యాలరీలను కరిగించడం తేలికవుతుంది.


ఇక వార్మప్‌ వలన కండరాల సంకోచం, వ్యాకోచం సులువవుతుంది. దాంతో ఏ ఇబ్బంది లేకుండా కండరాలను కదిలించవచ్చు. ఫలితంగా గాయాల బారిన పడడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదురవవు. వార్మప్‌ వల్ల శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా వేగంగా జరుగుతుంది. దాంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. వార్మప్‌ రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆఫీసులో ఎక్కువ సమయం ఉత్సాహంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.


ఇదే విధంగా.. వర్కవుట్ చేయడం మొదలుపెట్టిన వెంటనే వేగాన్ని ఒకే సారి పెంచకూడదు. మెల్లి మెల్లిగా వర్కవుట్స్ వేగాన్ని పెంచుకుంటూ పోతే శరీరంపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళా  తీవ్రంగా అలసట, నొప్పి వస్తే మాత్రం కాసేపు ఆగి ఆ తర్వాత కంటిన్యూ చేయడం చాల మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: