ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డిఁబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ డయాబెటిస్ వచ్చిన వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ఈ డయాబెటిస్ ఉన్నవారు జేబుకు చిల్లు పడకుండా ఉండేందుకు హెల్త్ పాలసీ తీసుకోవడం మంచింది. 


భారత్‌లో 2017 నాటికే 7.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ సంఖ్య కాస్త 2040 నాటికి 12.3 కోట్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇలా డయాబెటిస్ వ్యాధి భారిన పడిన వారు 60 ఏళ్లలోపు వారే 50 శాతం ఉంటున్నారు. అయితే డయాబెటిస్ పేషంట్లు లేడీ హడ్రింజ్ మెడికల్ కాలేజ్ సర్వే ప్రకారం పేషంట్ కుటుంబ ఆదాయంలో 5 శాతాన్ని డయాబెటిస్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు.  


దీంతో డయాబెటిక్ ట్రీట్మెంట్ ఖర్చులు పేషేంట్లకు ఇటీవల కాలంలో భారీగానే పెరిగాయి. దీంతో డయాబెటిక్ ట్రీట్మెంట్ ఖర్చు కుటుంబాలపై భారం పడుతోంది. అయితే ఇలాంటి బారి ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో డబ్బులు ఆదా చేసుకోవడంతో పాటు నచ్చిన హాస్పిటల్‌లో వైద్యం కూడా చేయించుకోవచ్చు. అంతేకాదు నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్న మీ డబ్బులు మీకు వెనక్కు వస్తాయి. అందుకే ప్రస్తుతం మార్కెట్ లో ఈ డయాబెటిస్ ఇన్సూరెన్స్ ప్లన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్స్ ని వినియోగించుకొని డబ్బుని అధ చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: