ఒక మనిషి ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువగా ఉంటే ఆ మనిషికి ఊబకాయం ఉందని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో ఊబకాయంను మేదోరోగమని పిలుస్తారు. గత పదేళ్లలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య రెట్టింపయింది. ఊబకాయం గల వ్యక్తికి గుండెజబ్బు, మధుమేహం, కేన్సర్ మొదలైన సమస్యలు వస్తాయి. ఊబకాయం రోగుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులే అని చెప్పవచ్చు. 
 
శారీరక, మానసిక శ్రమ లేకపోవడం, విలాసవంతమైన జీవనం గడపడం, పాస్ట్ ఫుడ్, నెయ్యి, వెన్న, ఐస్ క్రీములు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఊబకాయం వ్యాధి రావడానికి కారణమవుతాయి. ఊబకాయం సమస్యతో బాధ పడేవారు తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవాలి. వేయించిన ఆహారాలను తినడం తగ్గించి కాయగూరలను, పండ్లను ఎక్కువగా తినాలి. మొలకెత్తు గింజలు, పప్పుధాన్యాల వంటి పీచుపదార్థాలు అధికంగా గల ఆహారం తీసుకోవాలి. 
 
కొవ్వు, చక్కెర గల ఆహారాలు, మద్యం తీసుకోవటం తగ్గించాలి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. కొవ్వులు, పిండి పదార్థాలు తక్కువగా మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. రాత్రిళ్లు నిద్రలో భయంకరమైన గురక పెట్టటానికి ప్రధాన కారణం ఊబకాయం. ఊబకాయం వ్యాధి వచ్చినవారు చురుకుదనం లోపించి మందకొడిగా వ్యవహరిస్తారు. 
 
ఊబకాయం కారణంగా ఏర్పడిన కొవ్వు నుండి కొలెస్టెరాల్ ఏర్పడి రక్తనాళాల్లో పేరుకొని అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఒక పరిశోధనలో గత పదేళ్లలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారు ఆ తరువాత మధుమేహ వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. పాఠశాలలలో చదివే విద్యార్థులు జంక్ ఫుడ్ తీసుకోవటం వలన ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: