తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ చిన్నపిల్లలకు పొడుపు కథలు చెపుతాం. దాని విశిష్టతను తెలుపుతూ తెలుగులో పద్యాలు కూడా ఎన్నో. కానీ ఇప్పుడిప్పుడే ఆ పండు రుచి తెలుగు ప్రజలకు మరింత దగ్గరవుతోంది. ఇంతకీ ఆ పండు ఏంటి దాని విశిష్టతలు ఏంటి.. ఆరోగ్యానికి ఆ పండు ఎంతలా మేలు చేస్తుంది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 


పనస.. ఈ పండులోనే ఓ పస ఉంది.  ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు ప్రజలు తెలుసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాలు ఇప్పటికే పనసపై మక్కువ పెంచుకోగా మన దేశంలో ఇప్పుడిడప్పుడే ఈ పండుపై మనసు పడేసుకుంటున్నారు. ఆపిల్ అంత అందంగా కనిపించకపోయినా.. ఆపిల్ కంటే ఎక్కువగానే పోషక విలువలను అందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది పనస పండు. 


ఇక ఈ పండులో కేవలం గుజ్జు మాత్రమే కాదు చెట్టు కాండం నుండి కాయ వరకు అన్ని ఆరోగ్యానికి ఔషదాన్ని ఇచ్చేవే.  మొత్తానికి పనస ఒక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర..  ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. ఇప్పుడే ఇవే చిత్తూరు వ్యాపారులకు కోట్లను కుమ్మరిస్తున్నాయి. పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం అనే చెప్పాలి. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్‌ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్‌ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. 


వీగన్‌ డైట్‌ కి పనస బ్రాండ్. వీగన్ డైట్ అంటే పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్‌ డైట్‌ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ కూడా వీగన్‌గా మారారు కూడా. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరుతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఏపీలో మొత్తం 1197 హెక్టార్లలో, ప్రతీ సంవత్సరం ఇంచుమించుగా 41 వేల మిలియన్‌ టన్నుల పంట పండుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: