ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తే మజ్జిగ, నిమ్మరసం ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం మజ్జిగ, నిమ్మరసం స్థానాన్ని కూల్ డ్రింక్స్ ఆక్రమించాయి. దాహం తీరుస్తాయని, శక్తినిస్తాయని కొంతమంది ఎడాపెడా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సాధారణంగా కూల్ డ్రింక్స్ లో పాస్ఫరిక్ యాసిడ్, కార్బోలిక్ యాసిడ్ లాంటివి కలుపుతారు. ఆరోగ్యానికి పాస్ఫరిక్ ఆసిడ్, కార్బోలిక్ ఆసిడ్ చాలా ప్రమాదకరం. 
 
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో కూల్ డ్రింక్స్ లో ఉండే చక్కెర శరీరానికి ఎక్కువ క్యాలరీలను ఇవ్వటంతో పాటు బరువు పెరిగేలా చేస్తుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే కెఫీన్ మోతాదును మించితే గుండె కొట్టుకొనే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. కిడ్నీలపై కూల్ డ్రింక్స్ తాగడం వలన ఒత్తిడి పెరుగుతుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. 
 
కూల్ డ్రింక్స్ లో తీపి కోసం కలిపే రసాయనాల వలన టైప్ 2 మధుమేహం వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో గ్యాస్ట్రిక్, కిడ్నీ సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ తాగే వారికి త్వరగా ముసలితనం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక సంస్థ పరిశోధనలో తేల్చింది. మద్యం సేవించేవారు ఎక్కువగా ఆల్కహాల్ లో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతారు. ఆల్కహాల్ లో కూల్ డ్రింక్ కలుపుకొని తాగితే కిడ్నీ, లివర్ పై అధికంగా భారం పడుతుంది. 
 
కూల్ డ్రింక్స్ కు బదులుగా సహజసిద్ధమైన శీతల పానీయాలు, పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. మన శరీరంలోని ప్రతి అవయవాన్ని పాడు చేయగల సత్తా కూల్ డ్రింక్స్ కు ఉంది. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా కూల్ డ్రింక్స్ లో హానికర రసాయనాలను కలుపుతారు. అందువలన కూల్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: