జాన్సన్ అండ్ జాన్సన్ లో  ఔషధం ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన కేసులో అమెరికా ఔషధ సంస్థ 'జాన్సన్ అండ్ జాన్సన్‌'కు ఒక జ్యూరీ 800 కోట్ల డాలర్లు అంటే దాదాపు 57 వేల కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది.'రిస్పర్‌డల్' అనే యాంటీసైకోటిక్ ఔషధం వాడకం ప్రతికూల ప్రభావం వల్ల రొమ్ము పెరుగుదల ఉండొచ్చని జాన్సన్ అండ్ జాన్సన్ తనను హెచ్చరించలేదంటూ నికోలస్ ముర్రే అనే యువకుడు వేసిన కేసులో జ్యూరీ ఈ తీర్పు ఇచ్చింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలోని ఈ జ్యూరీ, ఆయనకు 800 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.


జాన్సన్ అండ్ జాన్సన్ సబ్సిడియరీ అయిన 'జాన్సెన్' ఈ ఔషధం మార్కెటింగ్‌లో రోగుల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిందని నికోలస్ ముర్రే తరపు న్యాయవాదులు వాదించారు. తనకు 'ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్' అనే సమస్య ఉన్నట్లు గుర్తించిన తర్వాత 2003లో వైద్యులు రిస్పర్‌డల్ ఔషధాన్ని రాశారని నికోలస్ ముర్రే తెలిపారు. ఈ ఔషధం వాడినందుకు తనలో రొమ్ములు పెరిగాయని చెప్పారు.స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్ చికిత్సకు రిస్పర్‌డల్ వాడేందుకు అనుమతి ఉంది. ఇతర సమస్యలకు కూడా ఈ మందు సరిపోతుందని వైద్యులు భావిస్తే రోగులకు దీనిని సూచించొచ్చు.


జ్యూరీ రూలింగ్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ తప్పుబట్టింది. జరిమానా చాలా అనుచితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రూలింగ్‌కు వ్యతిరేకంగా సంస్థ అప్పీలు చేయనుంది.అప్పీలుపై విచారణలో ఈ భారీ జరిమానా తగ్గే అవకాశముందని 'యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్ స్కూల్ ఆఫ్ లా'కు చెందిన ప్రొఫెసర్ కార్ల్ టోబియస్ చెప్పారు.


800 కోట్ల డాలర్ల (రూ. 57 వేల కోట్ల) తాజా జరిమానా రూలింగ్‌ను దీనిపై అప్పీలు విచారణలో తోసిపుచ్చుతారనే నమ్మకం తమకుందని జాన్సన్ అండ్ జాన్సన్ చెప్పింది. రిస్పర్‌డల్ లేబ్లింగ్‌కు సంబంధించిన కీలకమైన ఆధారాలు సమర్పించేందుకు తమ బృందం ప్రయత్నించగా, జ్యూరీ అడ్డుకుందని సంస్థ ఆరోపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: