హైదరాబాద్ మహా నగరం ఇక్కడ ఎంత విశాలంగా, ఎన్ని ఖర్చులు అవుతాయో అన్నే రోగాలు వస్తాయి. ఎప్పుడు చూడు విషజ్వరాలు, చికన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ అబ్బబ్బ చెప్పలేనన్ని రోగాలు.. ఆస్పత్రులు అన్ని ఫుల్ అయిపోతాయి. వైద్యుల గల్లా పెట్టెలు ఎప్పుడు ఫుల్ గా నింపుతుంటారు హైదరాబాద్ వాసులు. ఈ నేపథ్యంలోనే నగరంలోకి స్వైన్ ఫ్లూ వచ్చి కలకలం రేపింది. 


తాజాగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి స్వైన్‌ ఫ్లూ కేసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌ వాసికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే రెండు నెలల క్రితమే స్వైన్ ఫ్లూ తెలంగాణ ప్రజలకు చుక్కలు చూపించింది. రెండు నెలల క్రితం దేశంలో స్వైన్‌ ఫ్లూ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది.


ఎక్కువగా చలికాలంలోనే స్వైన్ ఫ్లూ వైరస్.. 


చలికాలం కారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో స్వైన్ ఫ్లూ వైరస్ పంజా విసురుతుంది. గాలిలో కలిసి ఉన్న ఎన్‌1హెచ్‌1 వైరస్‌ చలి పెరిగిన సమయంలో వేగంగా విస్తరిస్తుంది. అందుకే ఈ కాలంలో చాల జాగ్రత్తగా ఉండాలి. 


జలుబు అని నిర్లక్ష్యం వద్దు.. 


స్వైన్‌ ఫ్లూలో జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం వంటివి లక్షణాలు. ఈ లక్షణాలు మూడు రోజులకు మించి ఉంటే నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.


చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..


చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవడం వల్ల చాలా వ్యాధులు మన దగ్గరకు రావు. లేదు అంటే బయట ఉన్న దుమ్ము, దూళి వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. 



మరింత సమాచారం తెలుసుకోండి: