మనదేశంలో అత్యధికంగా పండే పంట వరి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బియ్యాన్నే ఎక్కువగా తింటూంటారు. వీరికి ఎన్ని రుచికరమైన పదార్ధాలు తిన్నా అన్నం తిననిదే సంతృప్తి ఉండదు. ఒప్పుడు ఇండియాలో అధికంగా మూడు పూటలూ అన్నానే తినేవారు. కాని జీవితాల్లో మార్పులు వస్తూంటాయి కదా.. అలానే.. తినే పదార్థాల్లో కూడా మార్పులు వచ్చాయి. వాస్త‌వానికి రోజుకు కావాల్సిన శక్తిలో 70 శాతానికిపైగా శక్తిని అన్నమే మన శరీరానికి సమకూరుస్తుంది. మన జీవితానికి అతి ప్రధానమైన అన్నాన్ని మన పూర్వీకులు వడ్లను దంచుకొని తినాల్సివచ్చేది.


దంచడంతో పోషక పదార్థాలు ఏవి నశించకుండా అన్నీ మిగిలి ఉండేవి. ఇక ప్ర‌స్తుత కాలంలో బియ్యాన్ని పాలిష్‌ పట్టడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ పాలిష్‌ పట్టడం అనే జబ్బు ముదిరిపోయి, బియ్యాన్ని ముత్యాల్లా మెరిసేట్లుగా పాలిష్‌ పట్టి మరీ తింటున్నారు. రెగ్యులర్ గా ఎక్కువ వైట్ రైస్ తీసుకోవడం వల్ల అధిక మలబద్దక లేదా జీర్ణ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే వైట్ రైస్‌లో కార్బో హైడ్రేట్స్ఎక్కువగా ఉంటాయి.


అందువల్ల రక్తంలోని గ్లూకోజు స్థాయులు పెరిగి పోయి డయాబెటిస్ బారిన పడతారు. వైట్ రైస్‌లో గంజి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కార్బో హైడ్రేట్స్ పెరిగి పోయి బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అలాగూ హ్యూమన్ బాడీకి గంజి అంత మంచిది కాదు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అధికంగా పెంచుతుంది. వైట్ రైస్ తీసుకోకపోవడం వల్ల మీరు తీసుకొనే న్యూట్రీషియన్స్ మీద ప్రభావం చూపించకపోయినా, బ్రౌన్ రైస్ తో పోల్చితే వైట్ రైస్ లో తక్కువ న్యూట్రీషినల్ విలువలు ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: