అధిక బరువు.. ఈ కాలంలో ఇది సాధారణం అయ్యింది. ప్రతి పది మందిలో నలుగురు ఖచ్చితంగా అధిక బరువుతో బాధపడుతుంటారు. వారు లావు తగ్గాలి అని ప్రయత్నించినా సరే ఎటువంటి లాభం ఉండదు.. కొంతమంది జిమ్ కి వెళ్లి సన్నగా అవ్వాలి అనుకుంటారు.. కానీ మొదటి రోజు వెళ్తారు మరి ఇంకా వెళ్లారు. ఎందుకంటే మొదటిరోజు అనే ఉత్సాహంతో ఎక్కువ కష్టపడతారు ఆ నొప్పులతో ఇంట్లో కూర్చుంటారు. 


ఇంకా డైట్.. అనుకుంటారు కానీ.. ఇది అందరూ చెయ్యలేరు అండి. కొంతమంది మాత్రమే సరైన డైట్ ఫాలో అయ్యి సన్నబడుతారు. అయితే ఆ సరైన డైట్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి, సన్నబడండి. రెండు రకాల బెర్రీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి దాంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే ఆ బెర్రీలు ఏంటి అనుకుంటున్నారా ? ఇంకే బెర్రీలు.. స్ట్రాబెర్రీలు, మల్బెర్రీలు. అయితే ఈ బెర్రీలు ఎలా తీసుకుంటే సన్నబడుతారో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


స్ట్రాబెర్రీలు.. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను ఈ స్ట్రాబెర్రీలు అందిస్తాయి. ఈ స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. జీర్ణ సమస్యలను క్రమంగా పోగొడుతాయి. అధిక బరువు ఉన్న వారు స్ట్రాబెర్రీలను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


మల్బెర్రీలు.. ఇవి సహజసిద్ధమైన తీపి రుచిని కల్గి ఉంటాయి. అందువల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ బెర్రీలను మనం వాడుకోవచ్చు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్, గోధుమ రవ్వ ఉప్మాలలో మల్బెర్రీలను వేసుకుని తినవచ్చు. దీంతో అధిక బరువును క్రమంగా తగ్గుతూ వస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: