మహిళలకు.. పురుషులకు.. కొన్ని ఏళ్లు దాటితే చాలు మేము ముసలి వాళ్ళమయిపోతున్నామనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడు దాని గురించే ఆలోచిసుంటారు. ఎప్పుడో వచ్చే దాని గురించి తలచుకుని ఇప్పటి నుంచే కలత చెందుతుంటారు. ఎప్పటికీ యవ్వనంతో ఉండిపోతే ఎంత బాగుండో అని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునే వారందరికీ సింగపూర్ నన్యాంగ్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారు.. ఆలస్యమెందుకు చదివేయండి మరి..!!
 
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయలేము కానీ, దాన్ని జాప్యం చేసేందుకు ఏం చేయాలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు  ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. బ్యుటిరేట్ ఫ్యాటీ యాసిడ్‌ను పెంచుకోగలిగితే ముదిమి దూరం.


మానవ శరీరం పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు.. జీవక్రియలు, పోషకాహారం, మనస్తత్వం, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి బ్యుటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ దీర్ఘాయువుకు కారణమయ్యే ఎఫ్‌జీఎఫ్21 అనే హార్మోన్ ఉత్పత్తికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. జీవక్రియల తీరును గాడిలో పెట్టడం ద్వారా ఈ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా చూసుకుంటే వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ పెటెర్సన్ తెలిపారు.


వయసు పెరగడం వల్ల బ్యుటిరేట్ ఉత్పత్తి తగ్గుతుందని, దాని ఫలితంగా శరీరం దుర్బలంగా మారి వృద్ధాప్యానికి త్వరగా చేరుకుంటామని  పేర్కొన్నారు. తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బ్యుటిరేట్ స్థాయిని పెంచుకోగలిగితే వృద్ధాప్యం ఆలస్యమవుతుందని వివరించారు. ఆ జాగ్రత్తలేవో తీసుకుని బ్యుటిరేట్ స్థాయిని పెంచుకుని వృద్ధాప్యంలోకి ఆలస్యంగా వెళ్ళండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: