ప్ర‌స్తుత స‌మాజంలో అధిక శాతం మంది ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాదారణంగా మారిన విషయం. టీవీ చూడ‌డ‌మో, గేమ్స్ ఆడ‌డ‌మో.. లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అనేక మంది ఆల‌స్యంగా నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తున్నారు. దీంతో సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తెలిసింది.


ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంద‌ట‌. వాళ్ళు  చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అంతేకాకుండా సూర్యోదయమం  సమయంలో నిద్రపోవడం వలన D-విటమిన్ లోపించం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలస్యంగా లేచేవారు త్వరగా మరణించే అవకాశం ఉన్నట్లు, వారిలో మానసిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.


అదే విధంగా ఏ విష‌యాన్ని కూడా అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోర‌ట‌. దీంతో వారికి నిత్య జీవితంలో అవ‌రోధాలు ఏర్ప‌డుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌రియు ఎక్కువ సమయం మేల్కొనే వారిలో అల్జిమర్స్ కారకాలు ఉత్తేజితంగా ఉంటాయని కూడా తెలుస్తోంది. సో.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే రాత్రి పూట త్వ‌ర‌గా ప‌డుకొని సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రోజంతా చురుగ్గా  కూడా ఉంటామట.


మరింత సమాచారం తెలుసుకోండి: