ఈ రోజు మనం  జిమ్‌ గానీ, వర్కవుట్స్‌ చేస్తున్నప్పుడుగానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందామా మరి.. జిమ్‌ గానీ, వర్కవుట్స్‌ చేస్తున్నప్పుడు గాని ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి అని నిపుణులు తెలుపుతూ ఉంటారు.

ఏ వయసు వాళ్ళు ఎలాంటి వర్కవుట్స్‌ చేయాలి. 21 ఏళ్ల వయసులోపు పిల్లలు జిమ్‌ కాకుండా స్పోర్ట్స్‌ ద్వారా ఎక్సర్‌సైజులు చేయాలి. స్పోర్ట్స్‌ వల్ల ఆల్‌రౌండ్‌ డెవలప్‌మెంట్‌ వస్తుంది.  22 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్నవాళ్లు జిమ్‌కు వెళ్లే ముందు డాక్టర్‌ క్లియరెన్స్‌ తీసుకోవాలి. మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఎలాంటి వర్కవుట్‌ సూచిస్తే వాటినే చేయాలి.


అతి తక్కువ, అతిగా కూడా చేయకుండా ఆప్టిమల్‌ లెవల్‌ అనుసరించాలి. హిమోగ్లోబిన్‌ నార్మల్‌గా ఉండాలి. ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. హిమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను ప్రతీ కణానికి సరఫరా చేస్తుంది. అందుకే హిమోగ్లోబిన్‌ లెవల్‌ తప్పనిసరిగా నార్మల్‌గా ఉండాలి. 
వర్కవుట్‌కు ముందు 5-6 బాదాం, 3-6 ఖర్జూరాలు తీసుకుంటే ఆక్సిజన్‌ అందించే కెపాసిటీ పెరుగుతుంది. బాగా చెమటలు పడుతుంటే, మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తుండాలి. వర్కవుట్‌ పూర్తయిన తర్వాత ఒక పండు, ఒక గుడ్డు తీసుకుంటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. దీనివల్ల ఒళ్లునొప్పులు కూడా రావు.


వర్కవుట్స్‌ రోజూ ఎంతసేపు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందామా మరి.. వర్కవుట్స్‌ మొదలెట్టిన తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. స్టామినాను బట్టి చేయాలి. అంతేగానీ శక్తిని మించి చేస్తే కండరాల నొప్పి, వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. సాధారణ వ్యక్తి రోజుకు 30 నిమిషాలు వర్కవుట్స్‌ చేస్తే సరిపోతుంది. అవసరాన్నిబట్టి పెంచుకుంటూ పోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: