ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చెయ్యాలంటే ఈ చిట్కాలు పాటించండి. 


పచ్చి మిర్చి బాగా తీసుకుంటే డయాబెటీస్ తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుందట. మాములుగా ప్రతిరోజు ఏదో ఒక కూరలో ఈ పచ్చి మిర్చిని తీసుకుంటాం. కానీ ప్లేట్ లో పెట్టగానే ఆ పచ్చిమిర్చిని పక్కకు తీసి పెడుతాం. కానీ ఆ మిర్చిని తీసుకుంటే డయాబెటిస్ తగ్గిస్తుందట, లేని వారికీ రాకుండా చేస్తుందట.   


బరువు ఎక్కువగా ఉన్న వారు మిర్చిని ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధి బారినపడకుండా ఉంటారట. రోజు క్రమం తప్పకుండా ఈ పచ్చిమిర్చీని ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండి చక్కెర వ్యాధి దరిచేరదట. అంతేకాదు పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయి రక్తంలో డయాబెటీస్ లెవల్స్ ఆరవై శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 


అలాగే క్యాప్సికమ్‌ మిరప రకం కూడా ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే ఒంట్లో వాపులు, నొప్పులు తగ్గుతాయట. అలాగే తలనొప్పి, మైగ్రేన్‌, ఒత్తిడి, సైనస్‌ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: