తులసి  అనగానే మన తెలుగు ప్రజలకు బాగా గుర్తుకు వచ్చేది ఒక ఆరాధ దైవం అని. మనము శరీరంలో వ్యాధినిరోధిక శక్తి బాగా పెంచుకోవాలని  అనుకుంటే కచ్చితంగా తులసి రసం కాని ఆకులు కాని తినాలి. తులసి తినడం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. మరి తులసి రోజూ తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా మరి....


 తులసి ఆకులు రోజు రెండు లేదా మూడు తీసుకోవడం వల్ల దంత సమస్యలు ఎప్పటికి రావు. నోటి నుంచి దుర్వాసన సమస్య కూడా తొలిగిపోతుంది.  . తులసి ఆకులు పది వేసి నీటిలో వేడి చేసి దానిని చల్లార్చి ఆ నీటిని తాగితే జ్వరం, దగ్గు నుంచి ఉపశమనం వస్తుంది.  శరీరం నుంచి మలినాలు చెమట రూపంలో బయటకు పోవాలి అంటే కచ్చితంగా తులసి ఆకులు రోజూ 10 తీసుకుంటే బాగుంటుంది అని నిపుణులు తెలియ చేస్తున్నారు.


తులసిని ముద్దగా చేసుకుని చిన్న చిన్న పదార్ధంగా తీసుకుంటే మలేరియా ఫ్లూ వంటి జబ్బులు రాకుండా ఉంటాయి. తులసి తినే తప్పుడు చేదు వగరు అనిపిస్తే తులసితో పాటు తేనె కొంచెం తీసుకోండి. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం కలుగుతుంది. ..తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, పింపుల్స్ పోయి ముఖం అందంగా తీర్చిదిద్దుతుంది.


జలుబు దగ్గు తగ్గని వారు, కచ్చితంగా ఉదయం తులసి వాటర్ తాగండి వల్ల ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల పొడి చేసుకుని దానిని వాటర్ లో కలుపుకు తాగినా ఆరోగ్యానికి చాల మంచిది అని నిపుణులు తెలియ చేస్తున్నారు. మీ పిల్లలు అన్నం తినకుండామారాం చేస్తున్నారా ఐతే  4 తులసి ఆకులు తినిపించండి కచ్చితంగా మీ పిల్లల లో మార్పు వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: