ప్రోటీన్ ఒక సూక్ష్మపోషకం. శరీరంకి పెద్ద మొత్తాలలో అవసరమయ్యే ఆహారంలో ఉన్న మూడు పోషకాలలో ఇది ఒకటి. ప్రోటీన్స్ వాళ్ళ ప్రయోజనాలు పుష్కలం. అనారోగ్యాలను ఎదుర్కోవడానికి, శరీర బాగాలను ఇంజురీ నుండి రక్షించడానికి, ప్రత్యేకంగా బరువు తగ్గడానికి, ప్రోటీన్ చాలా అవ‌స‌రం. తగినంత ప్రోటీన్ లేకపోతే తక్కువ పెరుగుదల మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో సహజమైన ఆహారానికి బదులుగా మార్కెట్లో దొరికే కృత్రిమ ప్రొటీన్‌ పౌడర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. 


అయితే.. అవగాహన లేకుండా ఎక్కువ ప్రొటీన్‌ వాడితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అవసరమైన మోతాదుకు మించి ప్రోటీన్లు తీసుకొనేవారు కఠినమైన వ్యాయామాలు లేదా చెమట చిందేలా పని చేస్తేనే తీసుకున్న అదనపు ప్రోటీన్లు ఖర్చవుతాయి. లేకుంటే అవి క్యాలరీలుగా కొవ్వు రూపంలో శరీరంలో పోగుపడి బరువు పెరిగేలా చేస్తాయి. నిపుణులు సూచిస్తున్న లెక్కల ప్రకారం పురుషులకు రోజులు 56గ్రా, మహిళలైతే 45గ్రా సహజసిద్ధమైన ప్రొటీన్లు అవసరం. 


అయితే హై ప్రొటీన్‌ తీసుకోవటం వల్ల మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగటం, దీనికి తోడు కష్టమైన కసరత్తులు చేయటం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో వెళ్ళిపోయి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. మితిమీరి ప్రొటీన్లు తీసుకుంటే శరీరంలో ఆమ్లం ఉత్పత్తి పెరగటంతో ఎక్కువైన ఆమ్లాన్ని శరీరం బయటికి పంపే ప్రయత్నంలో భాగంగా ఎముకల నుంచి కాల్షియంను సైతం విసర్జించటంతో ఎముకలు బలహీనపడతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: