ప్రస్తుత కాలంలో నగరాల్లో కార్పెరేట్ కంపెనీలు పెరగడంతో డే అండ్ నైట్ పనిచేసే వారి సంఖ్య కూడా పెరింగింది. ఇతర ఉద్యోగులతో పోల్చినప్పుడు రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరగా అలసిపోతారు. అయితే పగటిపూట పనిచేసే ఉద్యోగులతో పోల్చితే నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. నైట్ షిఫ్ట్ ఉద్యోగుల ప్రధాన సమస్య.. నిద్రలేమి. పడుకోగానే నిద్ర పట్టక పోవటం, పట్టినా వెంటనే మెళకువ రావటం, నాలుగు గంటలైనా హాయిగా నిద్రపోలేక పోవటం వల్ల కార్యాలయంలో నిద్ర పోవటం, పనితీరు మందగించటం వంటి సమస్యలు వస్తాయి.


అలాగే డే షిఫ్ట్ జాబ్ చేసే వారితో పోలిస్తే నైట్ షిఫ్ట్ జాబ్ చేసే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 44 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. పగటి పూట పనిచే వారితో పోల్చితే రాత్రిపూట పనిచేసే వారిలో గుండెపోటు, గుండె రక్త నాళాల్లో సమస్యలు వంటి సమస్యల ముప్పు 40 శాతం మేర ఎక్కువని రుజువైంది. ఎక్కువ కాలం పాటు రాత్రిపూట ఉద్యోగం చేసే మహిళలు కేన్సర్ బారినపడే ఆస్కారం ఎక్కువని అంటున్నారు.


అదే విధంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కార‌ణంగా చాలా మంది సంతాన‌లేమి స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతున్నారు. నైట్ షిఫ్ట్‌ ఉద్యోగుల్లో మెదడులోని రసాయనాల్లో వచ్చే మార్పుల వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ , త్వరగా కోపం రావటం, భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వేళకు తినకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్ల వీరిలో ఛాతీలో మంట, కడుపుబ్బరం వంటి జీర్ణ కోశ సమస్యల బెడద ఎక్కువ.


మరింత సమాచారం తెలుసుకోండి: