చేపల పులుసులా ఎంతో రుచిగా ఉంటుండే రొయ్యల పులుసును చేయడం చాలా ఈజీ అని చెప్పవచ్చూ. ఇక చేపల పులుసు అంటే అందులో ముళ్లుంటాయి. అందుకనీ ఆ ముళ్ళు తీసుకుంటు తినడం కొంచెం కష్టం. అవి గొంతులో ఇరుక్కుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ చాలా రుచిగా ఉండే ఈ పులుసును  ఏ మాత్రం కష్టం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చూ.

 

 

ఇక చిన్న చిన్న గరువు రొయ్యలైతే కూర రుచి ఇంకా పెరుగుతుంది. కొంచం పెద్ద రొయ్యలతో కూడా బాగుంటుంది. కానీ మరీ టైగర్ రొయ్యలైతె రొయ్యలలోకి ఉప్పు, కారం, పులుసు వాటికి అంత పట్టవు కాబట్టి రుచి మారుతుంది. ఇక ఇప్పుడు ఈ రొయ్యల పులుసుకు ఏం కావాలో తెలుసుకుందాం.

 

 

బాగుచేసిన పచ్చిరొయ్యలు 1కేజీ.. ఉల్లిపాయలు 4.. పచ్చిమిర్చి 4.. అల్లం వెల్లుల్లి ముద్ద... 2 స్పూన్స్ఉప్పు.. కారం రుచికి సరిపడ.. చింతపండు ఒక నిమ్మకాయంత.. పసుపు 1/2స్పూన్.. కోత్తిమీర తరుగు 1/4.. కప్పు పుదీన.. గరం మసాలాపొడి 1 స్పూన్..  ధనియాలపొడి 1స్పూన్.. జీరపొడి 1/2 స్పూన్.. జీర 1స్పూన్.. షాజీర1/2స్పూన్.. ఆవాలు కొంచం.. జీడిపప్పు కొంచం.. నూనె 5 స్పూన్స్.. 

 

 

తయారీ విధానం.. 
ముందుగా రొయ్యలను నీటిలో పసుపు, రాళ్ళ ఉప్పు వేసి కలిపి శుభ్రంగా కడిగి ఏ మాత్రం నీళ్ళు లేకుండా గట్టిగా పిండి తీసి వేయాలి. తర్వాత రొయ్యల రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. అటుపై చింతపండును నీళ్ళలో నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి అది కాగాక అందులో ఆవాలు వేసి చిటపట లాడనివ్వాలి. ఆ తర్వాత అందులో జీర, షాజీర వేసి వేయించుకోవాలి.

 

 

అవి వేగాక అందులో కొంచం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచం పుదినా, కొంచం కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోవాలి. అవి సగానికి పైగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయేవరకు బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగి మంచివాసన వచ్చేటప్పుడు అందులో ఉప్పు, కారం పట్టించి ఉంచిన రొయ్యలను వేసి బాగా వేయించుకోవాలి.

 

 

అవి కూడా బాగా వేగి అందులోని నీరంతా అయిపోయాక అందులో ధనియాల పొడి, జీర పొడి వేసి కలిపి, చిక్కగా తీసిన చింతపండు రసం పోసి కలిపి మూత పెట్టి బాగా ఉడికించాలి. ఆ పులుసు బాగా ఉడికి నూనె పైకి తేలేటప్పుడు అందులో చివరగా గరం మసాలాపొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి, ఒక 2నిమిషాలు మూత పెట్టి మగ్గించి దించాలి. అంతే టేస్టీ టేస్టీ రొయ్యల పులుసు రెడి అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: