అరటిపండును తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే మనలో చాలామందికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అయితే చాలా మందికి అరటి పండు తినడం ఎంత అలవాటో.. దాని తొక్కను కూడా చెత్త బుట్టలో వేయడం అంతే అలవాటు. వాస్త‌వానికి అరటి పండు మాత్రమే కాదు, అరటి పండు తొక్క కూడా మనకు మేలు చేస్తుంది. అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

 

దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది. అందుకనే ఆ తొక్కను తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది. కాలినగాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే ఆయా గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది అధిక బరువును ఇట్టే తగ్గిస్తుంది.

 

అలాగే అరటి పండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్ద‌డం వల్ల మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. అరటిపండు తొక్క చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. అలాగే మొటిమలకూ ఇది చక్కటి పరిష్కారం. మొటిమలున్న చోట అరటి తొక్కతో కొన్ని నిమిషాలు రాస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: