లోకంలో ఎక్కువగా సాగే వ్యాపారాల్లో ఫార్మసీ రంగం ఒకటి. మనిషికి ఏ చిన్న జబ్బు వచ్చినా మందుల షాపుకూ పరిగెత్తుతాడు. ఆ సమయానికి అతని దగ్గర డబ్బులు లేకున్నా అప్పు చేసుకునైనా ఆతని రోగానికి సరైన మందులు కొనుక్కొంటాడు.

 

 

మనిషికున్న ఈ బలహీనతకు వాడుకుని ఎందరో డాక్టర్లు, మెడికల్ షాపు వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. సమాజంలో ప్రతి వారు విద్యా రంగం పై, ఆరోగ్యరంగంపై అధికంగా ఖర్చు చేస్తుంటారు ఇది మనిషికి ముఖ్యమైన అవసరం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం వల్ల టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌ నుంచి ఏరియా ఆస్పత్రుల వరకూ దాదాపు 70 సర్కారు దవాఖాన్లలో ‘అమృత్‌‌‌‌’ పేరిట మెడికల్ షాపులు ప్రారంభం కానున్నాయి.

 

 

జనరిక్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌తోపాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్‌‌‌‌, ఇంప్లాంట్స్ సహా అన్ని ఐటమ్స్‌‌‌‌ ఈ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌‌‌‌తో రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ఒప్పందం చేసుకుంది. ఇందుకు గాను అన్ని రాష్ట్రల్లో ‘దీన్‌‌‌‌ దయాల్‌‌‌‌ అమృత్‌‌‌‌ పేరిట కేంద్ర ప్రభుత్వం మెడికల్ షాపులు ప్రారంభించనుంది. ప్రతి ప్రభుత్వ హస్పిటల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, ఈ సంస్థ షాపులు పెట్టి డిస్కౌంట్‌‌‌‌పై మెడిసిన్ అమ్ముతుంది.

 

 

ఇకపోతే హెచ్ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ సంస్థ సొంతంగా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తుండగా, మిగతా వాటిని కంపెనీల నుంచి బల్క్‌‌‌‌లో కొనుగోలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో తక్కువ లాభం చూసుకుని, ప్రజలకు అందుబాటులో ధరలో మందులు అందిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బయటి షాపుల్లో కంటే 30 నుంచి 40% తక్కువకు అమృత్ షాపుల్లో మెడిసిన్ లభిస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రమేశ్‌‌‌‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

 

 

ఈ షాపులను డిసెంబర్ 15 వ తేదిన ప్రారంభించడానికి సన్నహలు కుడా జరుగుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే దవాఖాన్లలో జనరిక్ మెడిసిన్ షాపులకు మాత్రమే అనుమతినివ్వాలని పదేండ్ల కిందటనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 54) జారీ చేసినప్పటికీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వమే అన్ని హాస్పిటళ్లలో మెడికల్ షాపులు పెట్టి బ్రాండెడ్‌‌‌‌ మెడిసిన్ అమ్మకాలకు తెర తీస్తుండడంతో, ఫ్రీ మెడిసిన్ పంపిణీ ఎత్తేస్తారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: