ప్రస్తుతం మార్కెట్‌లో సీతాఫలాలు విరివిగా దొరుకుతున్నాయి. సీతాఫలంలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు.  చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లను తిన్నారంటే మైమరిచి పోవాల్సిందే. అయితే ఇంత మంచి రుచి ఎన్నో పోషక విలువలను ఉన్న కొన్ని అపోహలతో ఈ పండ్లను దూరం పెడుతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ పండును తినొద్దు అనే అపోహ ఉంటుంది.

 

అయితే అది ఎంత మాత్రం నిజం కాదు. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో తెలుసా… 54. అందువల్ల ఈ పండును షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రూల్ ప్రకారం గ్లైసెమిక్ ఇండెక్స్ 55 లేదా అంతకంటే తక్కువ ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. సో.. డ‌యాబెటిస్ ఉన్న‌వారూ కూడా ఎలాంటి భ‌యం లేకుండా సీతాఫ‌లం తిన‌వ‌చ్చు. సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.

 

సీతాఫలం వల్ల మరో గొప్ప ప్రయోజనం పొటాషియం మరియు మెగ్నీషియం ఉండటం వల్ల, ఈ రెండు బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ పండ్లలోని విటమిన్ ఎ.. మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే... జీర్ణక్రియ బాగా అవుతుంది. గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: