అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే మీకు, మీ కుటుంబానికి అది ఏంతో మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తుంటారు. మొదటి దశలో నివారించడంతో తక్కువ ఖర్చుతో ఈ సమస్యనుంచి బయటపడే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాధి ముదిరాక ట్రీట్ మెంట్ తీసుకోవాలంటే సామాన్య ప్రజలకు ఆర్థిక పరిస్థితి సహకరించదు. చివరి నిమిషంలో ట్రీట్ మెంట్ వల్ల ప్రయోజనాల కంటే కూడా పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఎవరు ఏమి చెప్పలేరు. అందుకే తొలి దశలోనే టెస్టులు చేపించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని, మీ కుటుంబానికి అండగా నిలవడం చాలా మంచిది. ఈ ‘నేషనల్ హెల్త్ చెకప్ డే’ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వ్యాధి తొలి దశలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందని తెలపడమే. మీ ఆరోగ్యం కోసం హెల్త్ చెకప్ చేయించుకుని మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయండి అని సంస్థ తెలియచేస్తుంది.

 

ప్రపంచంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటే జీవన పరిస్థితుల్లో ఎన్నో మార్పు చోటు చేసుకుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉంటే ఆయా రంగాలలో వారి పనితీరు అంతే సమర్థవంతంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యం ప్రాముఖ్యతను చదువుకోని వారికి కూడా వివరిస్తే సమాజానికి మేలు చేసినవారవుతారు. మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 9.6% మాత్రమే వ్యాధుల నివారణకు ఖర్చు చేయడం జరుగుతుంది.

 

సమయం తెలుగు (టైమ్స్ ఆఫ్ ఇండియా) మరియు హెల్తియన్స్ సంయుక్తంగా ‘నేషనల్ హెల్త్ చెకప్ డే’ సందర్భంగా ఆరోగ్యం ప్రాముఖ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్త్ చెకప్‌పై అవగాహనా పెంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చేసి ఆరోగ్య మెరుగు పంచాలనే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం అని సంస్థ  వాళ్ళు పేర్కొంటున్నారు. ఏదో ఒక పని బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండేవారు కనీసం ఈ ఒక్కరోజైన తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే తొలిదశలోనే వ్యాధుల బారి నుండి బయట పడ వచ్చు. ఆరోగ్యకర సమాజంతో పటిష్ట భారతావనిని నిర్మిద్దామా.మరి. 'నేషనల్ హెల్త్ చెకప్ డే’ డిసెంబర్ 1 న నిర్వహించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: