ఓ వ్యక్తి  తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ.. డాక్టరును సంప్రదించాడు. అతనికి గత కొన్ని రోజులుగా తలనొప్పి చంపేస్తోందని.. చెప్పగా  డాక్టర్ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అది సాధారణ తలనొప్పి అని భావించి.. మందులు రాసిచ్చాడు. అయితే, అప్పటికీ అతడి తలనొప్పి తగ్గలేదు. పైగా ఇంకా రెట్టింపయ్యింది. తల బద్దలైపోతుందనేంత బాధతో మళ్లీ డాక్టర్‌ను సంప్రదించాడు. దీంతో అతడికి మెదడును స్కాన్ చేశారు.

డాక్టర్ ఆ రిపోర్టులు చూసి షాక్ అయ్యాడు.  వైద్యులకు అతడి మెదడులో పరాన్నజీవులు కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు, అవి వందల సంఖ్యలో ఉన్నాయి. దీంతో వైద్యులు మరింత లోతుగా అతడిని మెదడును స్కాన్ చేయగా.. అవి సాధారణ పరాన్న జీవులు కావని, అవి టేమ్‌వర్స్ (రిబ్బన్ తరహాలో పొడవుగా పాముల్లా ఉండే పురుగులు) అని తెలుసుకున్నారు. అనంతరం అతడి శరీరాన్ని మొత్తం స్కాన్ చేయగా ఛాతి, ఊపిరితీత్తుల్లో కూడా అవి కనిపించాయి. దాదాపు 700 టేప్‌వర్మ్స్ అతడి అవయవాలను చుట్టేసినట్లు తెలుసుకున్నారు.

ఈ ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ సమస్య ఏర్పడింది. దీన్ని ‘టైనియాసిస్’ అంటారని, టేప్‌వార్మ్ వంటి పరాన్నజీవులు శరీరం అవయవాల్లోకి చేరినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌‌ విభాగం వైద్యుడు డాక్టర్ వాంగ్ జియాన్ రాంగ్ వెల్లడించారు. అన్ని టేప్‌వార్మ్‌లు అవయవాల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని, ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. బాధితుడు నెల రోజుల కిందట పూర్తిగా ఉడకని పంది మాంసాన్ని తిన్నాడని తెలిపారు. ఆ మాంసం ద్వారానే టేప్‌వార్మ్‌లు అతడి శరీరంలోకి చేరి ఉంటాయని డాక్టర్ తెలిపారు. అవి శరీరం మొత్తం వ్యాపించాయని, చివరికి కండరాల్లో సైతం చేరిపోయాయన్నారు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకపోవడం వల్ల దాని శరీరంలో ఉండే టేప్‌వార్మ్ గుడ్లు బతికే ఉన్నాయని తెలిపారు. మాంసాన్ని తిన్నప్పుడు ఆ గుడ్లు కూడా శరీరంలోకి చేరి రక్తంతో కలిసి అవయవాల్లోకి చేరాయన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం.. టేప్‌వర్మ్ వంటి పురుగులు పంది మాంసంలో ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఆ మాంసాన్ని సరిగా ఉండికించి తినకపోతే వాటి అండాలు కేంద్ర నాడీ వ్యవస్థలోకి చేరుకుంటాయి. దాని వల్ల నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరాలు వస్తాయి. కాబట్టి.. మీరెప్పుడైనా మాంసాన్ని తింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాగా ఉడికించిన మాంసాన్ని మాత్రమే తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: