పుట్టగొడుగులు.. శాకాహారులు ఇదే మాంసం. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు మాంసం కంటే రుచిగా ఉంటాయి. అందుకే ఈ పుట్టగొడుగులను ఎన్నోరకాలుగా వండుకొని తింటుంటారు. పుట్టగొడుగుల బిర్యానీ అని, ఫ్రై అని, కూరా అని, ఫ్రైడ్ రైస్ అని ఇలా ఎన్నో రకాల పుట్టగొడుగుల రెసిపీని చేసుకొని తింటుంటారు. 

 

అయితే పుట్టగొడుగులు ఎన్నో పోషకాల నిధి అని చెప్పచ్చు. ఫ్యాట్ క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ సూపర్‌ ఫుడ్‌ డయాబెటిస్ ని తరిమికొడుతుందట. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఇవి ఔషధంగానూ పనికొస్తాయి. ఈ పుట్టగోగులలో ప్రోబయాటిక్‌ గుణాలు ఉన్నాయి. 

 

పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్‌, సెలీనియం వంటి యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గించేస్తాయి.

 

ప్రోబయాటిక్‌ ఫుడ్‌గా పుట్టగొడుగులు పనిచేస్తాయి. జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఇవి తోడ్పడతాయి.

 

కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండే వీటిని బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌ ప్లాన్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

డయాబెటిస్ తో బాధపడేవారు పుట్టగొడుగుల్ని ఎక్కువ మొత్తంలో తింటే కావల్సినంత ఫైబర్‌ అందుతుంది. దాంతో రక్తపీడనం, కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.

 

వీటిలోని లెక్టిన్‌ ప్రోటీన్లు కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటి వృద్ధిని అడ్డుకుంటాయి. మష్రూమ్స్‌లోని సెలీనియం మూత్ర కోశ కేన్సర్‌ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.

 

పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండే పుట్టగొడుగులు రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి.

 

పుట్టగొడుగులు 'విటమిన్‌ డి'కి మంచి ఆహారం. వీటిలోని క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. 

 

చూశారుగా.. ఇన్ని లాభాలు ఉన్న ఈ పుట్టగొడుగులు డయాబెటిస్ తగ్గించడానికి ఎంతో సహాయపడుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు పుట్టగొడుగులను తీసుకొని డయాబెటిస్ ని తగ్గించుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: