ఈ కాలంలో చాలమంది యువత తమకున్న బిజీ షెడ్యూల్ వల్ల గాని ఉద్యోగాల రిత్యాగాని సంపాదనలో పడి  పనుల హడావుడి వల్ల, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతున్నారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్‌‌గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

 

 

ఇకపోతే ఈ స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలతో పాటుగా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. అంతే కాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

 

 

ఇక  దాదాపు 113 మంది 60 ఏళ్ళ వయసు ఉన్న  హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించిన సైంటిస్టులు, వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో 58 శాతం టిఫిన్ తినని వారు ఉండగా.. 51 శాతం రాత్రి పూట భోజనం లేటుగా చేసేవారు  ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడు అలవాట్లు కలిగిన వారు 48 శాతం మంది ఉన్నారు. అంతే కాకుండా వీళ్ళే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని కూడా తేలిందట ఇలా రెండు పూటల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

 

 

దీంతో ప్రజలు ఇప్పటికైనా మేలుకొని.. బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా.. నైట్ భోజనం తొందరగా తినేలా అలవాట్లను మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక ఉదయం టిఫిన్‌గా పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.. నిజమే కదండీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఎందుకంటే సంపద ఎంతున్నా అనారోగ్యంతో ఉన్న వాడు నిత్య దరిద్రుడే. 

మరింత సమాచారం తెలుసుకోండి: