సాధారణంగా బియ్యం కేజీ 40 నుంచి 50 రూపాయలు ఉంటాయి. బాస్మతి వంటి బియ్యం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అవి 100 నుంచి 200 వరకూ ఉంటాయి. కానీ బియ్యం కేజీ 500 రూపాయలు ఉంటుందని ఎప్పుడైనా విన్నారా.. ఈ రకాలు కూడా ఉన్నాయి. అవే నల్లబియ్యం.

 

అవును చూడటానికి నల్లగా ఉండే ఈ బియ్యం చాలా కాస్ట్లీ.. ఉత్తరప్రదేశ్ లోని బదోహీ, చందోళీ జిల్లాల రైతులు ఈ రైస్ పండిస్తున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఇవి ఎమ్టీషుగర్ బ్లాక్ రైస్ అన్నమాట. వీటిని తింటే.. కేన్సర్, మధుమేహం, ఊబకాయం, రక్తహీనత వంటి రోగాలోత పోరాడే శక్తి పెరుగుతుందట. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న ఈ బియ్యానికి భారీ డిమాండ్ ఉంది.

 

అందుకే మార్కెట్లో ఈ బియ్యం కేజీ 400 నుంచి 500 రూపాయల దాకా ధర పలుకుతున్నాయి. ఈ పంట 155 రోజుల్లో చేతికి వస్తుంది. ఈ వరి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. సాగుతో లాభాలు పొందుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: