కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఉడికించిన గుడ్లలో విటిమిన్ ఇ, జింక్, ఐరన్, పొటాషియం ఉంటాయి. సాధారణంగా కోడి పెడితేనే గుడ్లు వస్తాయి. కానీ చైనాలో మాత్రం మనుషులు కృత్రిమ గుడ్లను తయారు చేస్తున్నారు. చైనాలో మనుషులు తయారు చేసే గుడ్లు మామూలు గుడ్లలానే ఉంటాయి. చైనా నుండి మన దేశంలోకి చైనా గుడ్లు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. గుడ్లు తినేవారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. 
 
ఈ కృత్రిమ కోడిగుడ్లలో కాల్షియం కార్బొనేట్ తో పెంకును, సోడియం అల్జినేట్ తో తెల్ల, పచ్చ సొనల్ని తయారు చేస్తారు. కోడిగుడ్డు ఆకారంలోని మౌల్డ్స్ తీసుకొని పసుపు రంగు మిశ్రమాన్ని పోసి మిశ్రమం మీద కాల్షియం కార్బొనేట్ పోస్తే పెంకు లోపలి పొర ఏర్పడుతుంది. పొర ఏర్పడిన గుడ్డును కొన్ని కెమికల్స్ లో ముంచి నిజమైన గుడ్లలా తయారు చేస్తారు. ఈ గుడ్లు తయారు చేయటానికి అయ్యే ఖర్చు మార్కెట్ లోని గుడ్ల ఖరీదు కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. 
 
నకిలీ గుడ్లను గుర్తించటం అంత తేలిక కాదు. కానీ నకిలీ గుడ్డును షేక్ చేసినపుడు వింతైన శబ్దం వస్తుంది. నకిలీ గుడ్లలో గుడ్డును పగలగొట్టిన వెంటనే వేగంగా పచ్చసొన, తెల్లసొన కలిసిపోతాయి. నకిలీ కోడి గుడ్డుకు నీచు వాసన ఉండదు. నకిలీ కోడి గుడ్డును గోటితో లేదా చాకుతో కొట్టినపుడు ఠంగుమనే శబ్దం తక్కువగా వస్తుంది. చైనా గుడ్లు నకిలీ గుడ్లు అయినప్పటికీ రుచిగా ఉండటం వలన వినియోగదారులకు అనుమానం రావట్లేదు. నకిలీ కోడిగుడ్ల పెంకును పగలగొట్టటం కొంచెం కష్టం. పెనం మీద పగలగొట్టిన గుడ్డు వేసినపుడు పచ్చ సొన, తెల్ల సొన గరిటెతో కదపకముందే కలిసిపోతుంటే నకిలీ గుడ్డు అని గుర్తించాలి. చైనీయులు ఆఖరికి కోడిగుడ్డుకు కూడా నకిలీలను సృష్టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: