గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం తెలిసిందే. ఆమ్లెట్ వేసినా, ఉడికించినా, ఫ్రై చేసినా.. ఎక్కువ మంది తినడానికి, వండటానికి ప్రాధాన్యం ఇచ్చేది గుడ్డుకే. ఇక బ్యాచిలర్స్‌ అయితే గుడ్డు లేకుండా రోజు గడవదు. వండటం తేలిక, పోషకాలు అధికం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. అయితే  కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా.

 

అయితే ఆరోగ్యానికి ఎంత వ‌ర‌కు మంచిది..? అస‌లు ఇలా తాగొచ్చా..? అన్న ప్ర‌శ్న‌లు వ‌చ్చే ఉంటాయి. కోడిగుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగ‌వ‌చ్చు. కానీ ప‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అని ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంద‌ట‌. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప ప‌రిమాణంలో ఉంటుంది. గుడ్డును అలాగే ప‌చ్చిగా తాగేస్తే… దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. అయితే ఆ బాక్టీరియా స్వ‌ల్ప ప‌రిమాణంలో ఉంటుంది క‌నుక దాంతో మ‌న‌కు ఏమీ కాదు. 

 

అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వారు ప‌చ్చి గుడ్ల‌ను తాగ‌కూడ‌దు. ఇక గుండెజబ్బుల బారిన ఎక్కువగా మగవారే పడుతుంటారు. అందువల్ల ప్రతి మగవారు రోజుకొక్క పచ్చి గుడ్డును అయినా తినాలి. అదే విధంగా  ప‌చ్చిగా తాగ‌డం క‌న్నా ఉడికించి గుడ్డు చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలూ ఇందులో ఎక్కవుగా ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: