బ్రేక్ ఫాస్ట్ రాజులా చేయాలి, లంచ్ ప్రిన్స్‌ లా తినాలి, డిన్నర్ బిచ్చగాడిలా తినాలనే మాట కూడా ఇప్పుడు పాపులర్ అయింది. అదే నిజం కూడా! పొద్దున మహారాజులా కడుపు నిండా తినాలి. ఎందుకంటే రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కాబ‌ట్టి. కాబ‌ట్టి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే బ్రేక్‌ ఫాస్ట్‌‌ మిస్ చేయొద్దని డాక్టర్లు స్ప‌ష్టం చేస్తున్నారు. బ్రేక్‌ ఫాస్ట్ మానేయడం వల్ల మెటబాలిజంలో మార్పులు వచ్చి.. ఆరోగ్యం చెడిపోతుంది. బరువు కూడా పెరుగుతారు అని తేల్చిచెప్తున్నారు. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన ఓ అధ్య‌య‌నంలో స్ప‌ష్ట‌మైంది. అలాగే బ్రేక్‌ ఫాస్ట్ చేయని వాళ్ల రక్త నాళాల్లో కొవ్వు చేరి మూసుకు పోతున్నట్టు మరో స్టడీలో తేలింది.  

 

అంతేకాదండోయ్‌...ఈ బ్రేక్ ఫాస్ట్ చేసే స‌మ‌యం విష‌యంలోనూ...స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు మ‌రియు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు నిపుణులు. ఎనిమిది గంటలలోపు బ్రేక్‌ ఫాస్ట్ చేసినప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎనిమిది గంటల తర్వాత తిన్నదాంట్లో చాలా వరకు శరీరానికి ఉపయోగపడకుండా.. కొవ్వుగా మారుతుందని స్ప‌ష్టం చేస్తున్నారు. ఆల‌స్యంగా లేవ‌డం, టిఫిన్ ప్రిపేర్ చేసుకోవ‌డంలో ఆల‌స్యం వంటి కారణాల వ‌ల్ల చాలామంది ఆల‌స్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ అల‌వాటు మంచిది కాద‌ట‌. ఎనిమిది గంటల లోపు తింటేనే.. మెటబాలిజం రేటు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, కూరగాయలుంటే ఇంకా మంచిదని స్ప‌ష్టం చేస్తున్నారు.

 

ఇక మ‌ధ్యాహ్న భోజ‌నం, రాత్రి భోజనం గురించి సైతం వివిధ విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కంటే మ‌ధ్యాహ్నం త‌క్కువ‌గా తినాలి అని చెప్తున్నారు. మ‌ధ్యాహ్నం కంటే రాత్రి ఇంకా తక్కువ తినాలని చెప్తున్నారు. అంటే... మధ్యాహ్నం ఉదయం కంటే తక్కువ, రాత్రి ఇంకా తక్కువ తినాలి. ఈ రూల్స్‌ ఫాలో అయినప్పుడు ఒబెసిటీ, డయాబెటిస్‌‌, బీపీ, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు దగ్గరికి రావని ఇప్పటికే ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: