మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. వ్యాధి మనిషికి ఉందో లేదో తెలుసుకునే లోగా చాపకింద నీరులా శరీరంలోకి చేరుతుంది. డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. ఇది వారికి లేదా వారి ఇంట్లో వారికి ఎవరికో ఒక్కరికి వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుకోవడానికి ప్రయత్నిస్తారు. డ‌యాబెటిస్‌ జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. ఈ వ్యాధికి ముఖ్య కారణాలు మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. 

 

శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించుకోకపోవడం వలన షూగర్ వస్తుంది. వాస్త‌వానికి ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే పసిగట్టాలి. డయాబెటిస్‌లో ప్రధానమైన టైప్-2 డయాబెటిస్‌ను కళ్లను చూసి గుర్తించవచ్చని అంటున్నారు నిపుణులు. ఎలాగంటే శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఒడిదుడుకులకు లోనైనప్పుడు కంటిచూపు మసకబారుతుంద‌ట‌. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అధిక చక్కెర స్థాయి రెటినాను దెబ్బతీస్తుంది. 

 

మీరు ఏదైనా వస్తువును స్పష్టంగా చూడలేకపోతుంటే కేవలం చూపు కోణంలోనే కాకుండా డయాబెటిస్ కోణంలోనూ ఆలోచించాలి. అధికంగా బరువు వారు, శారీరక శ్రమ లేని వారికి, కొన్ని సందర్భాల్లో వారసత్వంగా కూడా మధుమేహం వస్తుంది. అంతేకాకుండా తరచు జబ్బులతో బాధపడుతూ రోగనిరోధక శక్తిని కోల్పోయిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకూ డయాబటిస్ నివారణకు సరైన మందు కనుగొనలేదు. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: