సాధార‌ణంగా పాలు, పెరుగు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి తిరిగి నిద్రపోయే వరకు ఏదొక రూపంలో పాల ఉత్పత్తుల తీసుకుంటూనే ఉంటాం. అన్నం తినేటప్పుడు పెరుగు తీసుకోకపోతే చాలామందికి వెలితిగా ఉంటుంది. ఇక చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని, నిద్ర వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి.

 

అయితే రాత్రిపూట పెరుగు తినవచ్చా ? తినకూడదా ? అనేది మరో పెద్ద డైలమా ? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే.. మరికొందరు అస్సలు రాత్రి పూట డిన్నర్ లో పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు ? అసలు ఏది వాస్తవం.. ?? అని అనుకుంటున్నారా..? వాస్త‌వానికి రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదని, ఇక నుంచి తినడం మనేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగు వల్ల దేహంలో కఫం పెరిగిపోతుందట. దీని ద్వారా జలుబు, దగ్గు ఉన్న వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. 

 

కానీ ఇలాంటి స‌మ‌స్య‌లు లేనివారు రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇక పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి. రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: