చికెన్, మ‌ట‌న్, ఫిష్ ఈ వంటకాలు అందరికి నోరూరించేవే.. అయితే జ్వరం వ‌చ్చిన వారు మాంసాహారానికి దూరంగా ఉండాలని వైద్యులు, మన పెద్దలు చెబుతుంటారు. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు నాన్ వెజ్ ఎందుకు తిన‌కూడ‌దు? అస‌లు తింటే ఏం అవుతుంది? అన్న ప్ర‌శ్న‌లు వ‌చ్చే ఉంటాయి. అయితే ప‌చ్చ కామెర్లు వ‌స్తాయ‌ని చాలా మంది అంటారు. నిజానికి శరీరంలో ప్రతి క్షణం మంచి చెడు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందులో మంచి క్రిములు గెలిస్తే, ఆరోగ్యం, చెడు క్రిములు గెలిస్తే ఏదో ఒక నలతగా అనిపిస్తుంది. 

 

ఇక సాధార‌ణంగా ఎవ‌రికైనా జ్వ‌రం వ‌స్తే జీర్ణ‌శక్తి బాగా త‌గ్గిపోతుంది. దీంతో డాక్ట‌ర్లు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమంటారు. అలాంట‌ప్పుడు స‌రిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దాంతో లివ‌ర్‌పై లోడ్ ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంది. అలాంట‌ప్పుడు ప‌చ్చ‌కామెర్లు వ‌స్తాయి. క‌నుక జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం అస్స‌లు తిన‌రాదు. అందుకే  తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తింటే మంచిదని సూచిస్తారు. 

 

నిజానికి జ్వరంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల మాత్రమే కాదు, పలు ఇతర కారణాల వల్ల, కొందరికి పచ్చ కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా హోటల్స్‌లో భోజనం చేసే వారికి, ఆయిల్ ఫుడ్స్ తినేవారికి, నాన్ వెజ్ వంటకాలు ఎక్కువ‌గా తినే వారికి, కూల్ డ్రింక్స్ తాగేవారికి, బ‌య‌ట ఫుడ్స్ ఎక్కువ‌గా తినేవారికి మ‌రియు బాగా మద్యం సేవించే వారికి కూడా పచ్చ కామెర్లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. సో.. బీకేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: