మన పూర్వీకులు బెల్లంతో చేసిన పదార్ధాలని ఎక్కువగా వాడేవారు. ఆ తరువాత మారుతున్న కాలానికి అనుగుణంగా చెక్కెర వాడుకలోకి వచ్చింది. అయితే చెక్కర అందుబాటులో ఉన్నా సరే బెల్లానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎప్పుడో సందర్భాను సారంగా బెల్లం వాడకం జరిగుతోంది తప్ప అన్నిటిలో చెక్కెర వాడకం ఎక్కువ అయ్యింది. వాస్తవానికి చెక్కెర కంటే బెల్లం వాడకం ఎంతో ఆరోగ్యకరమైనదని అంటున్నారు నిపుణులు.  

 

అసలు బెల్లం వాడటం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి అంటే...

 

బెల్లంలో కేలరీస్ తక్కువ అందుకే మనం బెల్లంతో చేసిన పదార్ధాలు తినేటప్పుడు బరువు పెరిగిపోతాము అనే భయాన్ని పక్కన పెట్టి హాయిగా తినచ్చు. అంతేకాదు కొన్ని అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలోనూ, రోగాలు చేరకుండా నిలువరించడం లోనూ బెల్లం పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. జీర్ణ క్రియని సరైన పద్దతిలో నడిపించడంలో బెల్లం చేసే మేలు మరేది చేయదు.

 

రోజు బెల్లం తినడం వలన లివర్ ఎంతో ఆరోగ్య కరంగా ఉంటుంది. లివర్ లో ఉండే చెడు బ్యాక్టీరియా ని బెల్లం తరిమి తరిమి కొడుతుందని చెప్పడంలో సందేహం లేదు. బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది దాంతో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలన్స్ గా ఉంటాయి దాంతో కండరాలు ఎంతో బలంగా మారుతాయి.

 

రక్తాన్ని సుద్ది చేయడంలో బెల్లానికి ఓ ప్రత్యేకత ఉంది. రోజు బెల్లం తింటే రక్తం శుద్ది అవ్వడమే కాకుండా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో మనం చాలా వ్యాధులని దూరం చేసినట్టే. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ , సెలినియం లాంటి ఖనిజాలు ఉంటాయి వీటివలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో రోగాల బారిన పడకుండా ఉంటాము.

 

మోకాళ్ళు, మోచేతులు నెప్పులు ఎక్కువగా వచ్చే వారికి బెల్లం తో పాటు కొంచం అల్లం కూడా కలిపి ఇస్తే నెప్పులు ఇట్టే తగ్గిపోతాయి. ముఖ్యంగా పాలలో బెల్లం, అల్లం రసం కలుపుకుని త్రాగితే తప్పకుండా నొప్పుల్ని నివారిచడమే కాకుండా ఎముకల ధృడత్వం కూడా పెరుగుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: