మన జీవక్రియల్ని శుభ్రం చేసుకోవడానికి నిమ్మరసం తీసుకుంటామని, లెమన్ జ్యూస్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని మనకు తెలుసు. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి. జీర్ణ‌క్రియ బాగా జ‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే నిమ్మ‌ర‌సం తాగితే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే. అయితే నిమ్మ‌ర‌సం మేలు చేస్తుంది క‌దా అని చెప్పి దాన్ని మోతాదుకు మించి మాత్రం తాగ‌కూడ‌దు. ఎందుకంటే లెమన్ జ్యూస్ ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.

 

నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ సి మ‌న‌కు అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తుంది. డ‌యేరియా, వాంతులు, వికారం వంటివి సంభ‌విస్తాయి.నిమ్మరసం అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. అసిడిక్ నేచర్ కలిగిన లెమన్ జ్యూస్ వంటివి తీసుకోవడం వల్ల దంతాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది. అలాగే దంతాలు క్ష‌యం, త్వ‌ర‌గా దంతాలు పుచ్చిపోతాయి వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  

 

అలాగే నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తాగితే క‌డుపులో యాసిడ్ల శాతం పెరుగుతుంది. దీంతో క‌డుపు మంట,  గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి వంటివి వ‌స్తాయి. నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది అక్యుట్ మైగ్రేన్ లేదా క్రోనిక్ టెన్షన్, తలనొప్పి దారితీస్తుంది. అదే విధంగా నిమ్మ‌ర‌సం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశ‌యం ఎక్కువ‌గా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. దీంతో ఆ భాగంపై అధిక ఒత్తిడి ప‌డి మూత్రాశ‌య సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: