చలితీవ్రత రోజురోజూకు రాష్ట్రంలో పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల మేర కనిష్ఠ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే కాకుండా చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు..

 

 

చలికాలంలో హృదయ సంబంధ వ్యాధులు పెరగడానికి రక్తపోటు పెరుగుదల ప్రధాన కారణం కావచ్చు. ధమనులు ఇరుకుగా ఉండడం వల్ల  గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. చలికాలం రక్త ప్రవాహంలో కొన్ని ప్రోటీన్ల స్థాయిలను పెంచుతుంది. కాబట్టి దీని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండే అవకాశం ఉంది కావున ఈ మార్పు గుండెపోటు రావడానికి కారణం కావచ్చని తెలుపుతున్నారు. ఇక ముఖ్యంగా చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు వైద్యులు..

 

 

మరోవైపు, గుండె జబ్బులున్నవారు చలికాలంలో వారి గుండె మానసిక ఒత్తిడి స్థాయిలను ఎప్పటికప్పుడు  చెక్ చేసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు. అయితే చలి తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో  మార్నింగ్ కాకుండా ఈవినింగ్ ఎక్సర్‌సైజ్‌ చేయాలని ఇదే కాకుండా బాడీలో ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచడానికి ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని చెబుతున్నారు.

 

 

ఇకపోతే ఛాతిలో నొప్పిగా ఉండటం, చెమట, మెడ, దవడ, భుజం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో గుండెపోటు వల్ల మరణించే రేటు 50 శాతం ఎక్కువ. ఇక చలికాలంలో గుండెపోటు, గుండె జబ్బుల బారిన పడే వాళ్లలో 65 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి..

 

 

ఇక అకస్మాత్తుగా వచ్చే గుండెవ్యాధులవల్ల మనిషి సడెన్‌గా మరణించే అవకాశం ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారు ఇందుకోసం తగిన మందులు అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం అని తెలుపుతున్నారు డాక్టర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: