ఏ కూర చెయ్యాలన్నా ఉల్లిపాయ తప్పనిసరిగా కావాల్సిందే. పరిశోధకులు చేసిన పరిశోధనల్లో కట్ చేసిన ఉల్లిపాయలను ఎక్కువ సమయం నిల్వ ఉంచితే ఆ ఉల్లిపాయలు విషతుల్యంగా మారి ఎన్నో రోగాలకు కారణమవుతాయని తేలింది. కొందరు ఉల్లిపాయలను కోసిన తరువాత ఫ్రిడ్జ్ లో ఉంచాలని అనుకుంటారు. నిపుణులు మాత్రం ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో ఉంచినా సమస్యలు తప్పవని చెబుతున్నారు. 
 
కోసి నిల్వ ఉంచిన ఉల్లిలో కొన్ని టాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. గాలి, కొన్ని రకాల బ్యాక్టీరియాలను కోసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలు పీల్చుకుంటాయి. కోసి నిల్వ ఉంచిన ఉల్లిపాయల నుండి విడుదలయ్యే టాక్సిన్స్ వలన ఎన్నో రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలను తినడం వలన తలనొప్పి, వాంతులు, డయేరియా మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 
 
కోసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలను తినేవారికి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు. సమయం ఆదా అవుతుందని రాత్రి సమయంలో కట్ చేసుకొని ఉదయం నిల్వ ఉంచిన ఉల్లిపాయలను వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్ని ఎప్పుడైనా కోసిన వెంటనే వాడటం మంచిదని ఏ కారణం చేతనైనా ఉల్లిపాయలను నిల్వ ఉంచితే ఆ ఉల్లిపాయలను పాడేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: