మొటిమెలు.. యువతులను, మహిళలను బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని అరికట్టడం కొందరికి సాధ్యం కాకపోవచ్చు.. అలాంటి వారికి సింపుల్ చిట్కా.. అందులోనూ అది మన ఇళ్లలో దొరికే వాటితోనే.. ఎలాగో చూద్దాం.. మొటిమలకి వేపాకు మంచి మందు అంటున్నారు సౌందర్యనిపుణులు. ఇందులోని ఔషధ గుణాలు అటు జిడ్డు చర్మం నుంచి నూనె కారకుండా చేస్తాయి.

 

అంతేకాదు.. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి.అలాగే ఇందులో సమృద్ధిగా ఉన్న విటమిన్-, ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మాన్ని మృదువుగానూ తేమగానూ ఉంచుతాయి. కాబట్టి వేపాకు అన్ని రకాల చర్మానికి మంచిదే.

 

ఏం చేయాలంటే.. వేపాకుని బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి. తరవాత ఆ నీటిలో గంధం పొడిని కలిపి ముద్దలా చేసి ముఖానికి మెడకీ పట్టించి పావుగంట సేపు ఉంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మానికి పనిచేసే ఈ మాస్క్ వల్ల ముఖంమీద మొటిమలు క్రమంగా తగ్గి, అది క్రమంగా మెరుపుని సంతరించుకుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: