ప్రతి  నిద్ర   ప్రేమికుని కల  నిద్ర పోవడం ఆ   కల  ఇప్పుడు  నిజము కానుంది.  బెంగళూరు ఆధారిత ఆన్‌లైన్ స్లీప్ సొల్యూషన్స్ సంస్థ అయిన వేక్‌ఫిట్ ఒక గమ్మతైనా ఐడియా తో ముందుకు వచ్చింది.  నిద్ర ప్రేమికుల కోసం ఈ సంస్థ ఒక ఇంటర్న్‌షిప్ ను తెచ్చింది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రకారం 100 రోజుల పాటు రోజూ తొమ్మిది గంటల నిద్రకు మీకు లక్ష రూపాయలు ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది.

 

ఈ ఇంటర్న్‌షిప్‌ను చేజించుకోవడానికి  మీరు చేయాల్సిందల్లా సంస్థకు నిద్రపోవడానికి మీ ప్రేమను నిరూపించడమే. అయితే కంపెనీకి ఒక షరతు ఉంది. 'పని' సమయంలో మీరు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించకూడదు. ఎంపికైన అభ్యర్థులు సంస్థ యొక్క పరుపు  పై నిద్రిస్తారు, మంచి  ఫిట్నెస్ కోసం  స్లీప్ ట్రాకర్ ఉపయోగించి  నిపుణుల నుండి కౌన్సెలింగ్ సెషన్లను పొందుతారు.  షార్ట్‌లిస్ట్ చేసిన  అభ్యర్థులను నిద్రపై ఉన్న ప్రేమను ధృవీకరించే వీడియో టెస్టిమోనియల్‌లను పంపమని అడుగుతారు. విజేతలకు స్లీప్ ట్రాకర్ ఇవ్వబడుతుంది, దీని సహాయంతో కంపెనీ తమ పరుపు లను  ఉపయోగించే ముందు మరియు ఉపయోగించిన  తరువాత నిద్ర నమూనాలను రికార్డ్ చేస్తుంది.

 

ఎవరైతే వారి జీవితం లో నిద్రకు చాల ప్రాధాన్యత ఇస్తారో వారిని మేము ఉత్తమ స్లీపర్‌లుగా  నియమించాలనుకుంటున్నాము. స్లీప్ ఇంటర్న్‌షిప్ "ఆరోగ్యమైన  నిద్ర అలవాట్లను మరియు వాటిని పాటించే వ్యక్తులను ప్రశంసించడం ద్వారా నిద్ర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది ”అని వేక్‌ఫిట్.కో డైరెక్టర్ మరియు సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ పేర్కొన్నారు. 

 

వేక్‌ఫిట్ వెబ్‌సైట్‌ ప్రకారం మీ  జాబ్ ముఖ్య కర్తవ్యం నిద్ర పోవడం. నిద్ర పట్ల అపారమైన ప్రేమ మరియు తొందరగా నిద్ర పోయే సామర్త్యం ఈ  ఇంటర్న్ షిప్ కు కావాల్సిన ముఖ్యమైన అర్హత. మీ స్వంత నిద్ర రికార్డులను బద్దలు కొట్టడానికి సాటిలేని ఉత్సాహం, ఎక్కువ సమయం నిద్ర పోవాలనే  తపన ఒక ముఖ్యమైన ఆయుధం. మీరు మీ ఉద్యోగ కర్తవ్యాలను సరిగ్గా పూర్తి చేసిన తర్వాత కంపెనీ మీకు అక్షరాలా లక్ష రూపాయలను స్టైఫండ్‌గా రివార్డ్ చేస్తుంది. వేక్ ఫిట్ చేసిన 'రైట్ టు వర్క్ నాప్స్' అనే సర్వే ప్రకారం, 1,500 మంది లో  70 శాతం మంది తమ వర్క్  వద్ద 'నాప్ రూమ్' లేదని చెప్పారు. వారిలో దాదాపు 86 శాతం మంది ఇలాంటి న్యాప్ గది తమ పని సామర్త్యని  పెంచడానికి సహాయపడుతుందని చెప్పారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: