కొందరు పరిశోధకులు శాఖాహారులు, మాంసాహారులపై కొన్ని పరిశోధనలు చేశారు. శాఖాహారులు, మాంసాహారులలో దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ఎవరికి ఎక్కువగా వస్తాయని జరిగిన పరిశోధనలో ఊహించని విషయాలు వెల్లడయ్యాయి. ఈ మధ్య కాలంలో ఆకు కూరలు, కాయగూరలు, చిరుధాన్యాలు తినే వారు ఆరోగ్యంగా జీవిస్తారని ప్రచారం జరుగుతోంది. శాఖాహారం తినేవారిలో ఆరోగ్యం నిలకడగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 
 
కానీ ఒక యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో మాత్రం శాఖాహారులలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని మాంసాహారులలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. బీ12, కొలెస్ట్రాల్ మాంసాహారుల రక్తనాళాల గుండా ఎక్కువగా ప్రవహించడం వలన మాంసాహారులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ పరిశోధనలో మాంసం తినే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువని తేలింది. 
 
శాఖాహారులలో గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తక్కువని 4,000 మందిపై జరిపిన ఈ పరిశోధనలో శాఖాహారమే మంచిదని పరిశోధకులు తేల్చారు. శాఖాహారం తీసుకునేవారిలో రక్తపోటు కూడా తక్కువగా వస్తుంది. శాఖాహారం తీసుకునే వారిలో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, కీళ్ల నొప్పులు తక్కువగా వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫైబర్ శాతం కూడా శాఖాహారం తీసుకునేవారిలో ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకులు శాఖాహారం తీసుకునేవారిలో అమైనో ఆమ్లం అధికంగా ఉంటుందని అమైనో ఆమ్లం రక్తపోటును నివారిస్తుందని తేలింది. మాంసాహారం తీసుకుంటే శరీరంలో రక్త శాతం పెరగదు. పుదీనా, బెల్లం, ఆకుకూరలు తినేవారికి రక్త శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: