ప్రస్తుతం ప్రపంచంలో  చాలా  మంది  కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధ పడుతుంటారు.  ఇలా కిడ్నీ వ్యాధి బారిన పడిన ఒక వ్యక్తి ఢిల్లీలో  సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఎడిపికెడి) తో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తి శరీరం నుండి 7.4 కిలోల బరువున్న కిడ్నీని తొలగించడం జరిగింది.  ఇది భారతదేశంలో అతిపెద్ద మూత్రపిండం, ఇప్పటివరకు ప్రపంచంలోనే  మూడవ అతి పెద్దదిగా  గుర్తిచడం జరిగింది. 

 


అసలు ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ADPKD) అనే వ్యాధి ఏంటో తెలుసుకుందామా మరి... జన్యుపరమైన రుగ్మత, ఇది మూత్రపిండాలలో అనేక తిత్తులు పెరగడం జరుగుతుంది.  ఈ తిత్తులు మూత్రపిండాల లోపల నెఫ్రాన్స్ అని పిలువబడే జుట్టు-పరిమాణ నిర్మాణాల గోడలపై ఏర్పడి ఇవి రక్తం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినా వారికీ  లక్షణాలు ఇలా ఉంటాయి..వెనుక మరియు పక్కటెముకలు, పండ్లు మధ్య నొప్పి, తలనొప్పి, మూత్రంలో రక్తం, అధిక రక్తపోటు, మూత్రపిండాల లోపం చాలా సాధారణ లక్షణాలు ఉంటాయి.

 


వాస్తవానికి ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందామా మరి..ADPKD అనేది PKD1 మరియు PKD2 జన్యువులోని ఉత్పరివర్తనాల వల్ల సంభవించడం జరుగుతుంది.  ఇవి మూత్రపిండాలు  శరీరంలోని ఇతర భాగాల సరైన పనితీరుకు ప్రోటీన్లను  సృష్టించడం జరుగుతుంది. ADPKD కుటుంబాలలో ఆటోసోమల్ ఆధిపత్య లక్షణంగా వారసత్వంగా రావడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి రావడం వల్ల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దమా మరి.. ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధికి (కిడ్నీలు సరిగా పనిచేయలేనప్పుడు) ADPKD కూడా ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. ఇది మూత్రపిండాల వ్యాధి అయినప్పటికీ, ADPKD మల్టీసిస్టమ్ డిజార్డర్‌కు దారితీసి ఇతర అవయవ వ్యవస్థలను ప్రభావితం బాగా చేయడం జరుగుతుంది.  

 


మొత్తానికి ADPKD కి చికిత్స లేనప్పటికీ, చికిత్స లక్షణాలను సులభతరం చేస్తుంది, జీవితాన్ని పొడిగిస్తుంది. చికిత్సలో డయాలసిస్ మరియు మూత్రపిండ (కిడ్నీ) ​​మార్పిడి చేయడం జరుగుతుంది. ADPKD ను పూర్వం వయోజన పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అని అంటూవుంటారు, ఎందుకంటే ఇది సాధారణంగా నాల్గవ లేదా ఐదవ దశాబ్దంలో సంభవించింది - కాని ఇది పిల్లలు మరియు శిశువులలో కూడా నివేదించడం జరిగింది.  స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమానంగా ఈ వ్యాధి సోకె  అవకాశం చాల ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: