ప్రస్తుత  ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఫిట్ నెస్  కోసం చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ఫిట్ నెస్  కోసం ప్రయత్నం చేసే వారి కోసం వాకింగ్‌తో  ఫిట్ నెస్ అనే అంశం మీద తెలుసుకుందామా మరి..కానీ ఖర్చు లేకుండా శరీర సౌష్టవాన్ని పెంచే అద్భుతమైన వ్యాయామం వాకింగ్‌ అని అంటారు అంటూ ఉంటారు.  ఏ పరికరాలూ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.

 


వాకింగ్‌ ఎటువంటి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఎవరికి వారు స్వేచ్ఛగా అనువైన వేళల్లో, నచ్చిన ప్రదేశంలో వాకింగ్‌ చేసుకునే వీలుంది. కాళ్లల్లో, పిక్కల్లో, పాదాల్లో రక్తప్రసరణ పెరిగి, శుద్ధి ప్రక్రియలో భాగంగా చెడురక్తం గుండెకు వెళ్లడంలో ఏ అంతరాయం ఏర్పడకుండా వాకింగ్‌ రక్షిస్తుంది. ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్ల  గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అని నిపుణులు తెలుపుతుంటారు.

 


ఇక వాకింగ్‌ చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందామా మరి.. వాకింగ్ వల్ల ఎముకలు, కండరాలు పటిష్టమవుతాయి. వాకింగ్ చేయడం వలన కార్టిలేజ్‌, టెండాన్స్‌, లిగమెంట్లు బలపడటం వల్ల కీళ్ల నొప్పులకు వచ్చే అవకాశం అసలు ఉండదు.  క్రమం తప్పకుండ వాకింగ్ చేస్తే శరీర బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా, అధిక రక్తపోటు, మదుమేహం వ్యాధులకు తావులేకుండా పోతుంది. ఒక వేళ అప్పటికే అవి మొదలై ఉంటే, వాకింగ్తో అదుపు తప్పకుండా ఉంటాయి. కాకపోతే వాకింగ్‌ను మించిన ప్రయోజనం బ్రిస్క్‌ వాకింగ్‌ వల్ల కలుగుతుంది.

 

 గంటకు 6 కిలోమీటర్ల దాకా నడవడం ద్వారా శరీరంలోని జీవక్రియలన్నీ పూర్తిగా చైతన్యవంతమవుతాయి.  వాకింగ్‌ మొదలెట్టిన వారిలో అత్యధికులు మధ్యలో మానేసే వారే. దీనికి విరుగుడల్లా ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి వాకింగ్‌ చేయడమే.  ఒంటరిగా చేసే వాకింగ్‌ విషయంలో వాయిదా వేసే అవకాశాలు చాల ఎక్కువగా ఉంటాయి. సమిష్టి వాకింగ్‌లో ఆ అవకాశాలు బాగా తక్కువ. పైగా నలుగురితో కలిసి నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా అస్వస్థతకు గురైనా ఆదుకునేందుకు తోడుగా సహచరులు ఉంటారు. దీనివల్ల కొంత అనారోగ్యంగా ఉన్నవారూ వాకింగ్‌లో పాల్గొంటారు.

 

ఇలా అన్ని దశల్లోనూ వాకింగ్‌ నిరాటంకంగా కొనసాగుతుంది. వీటన్నింటికన్నా నలుగురితో మాట్లాడుతూ నడవడం వలన సంబంధ బాంధవ్యాలు మెరుగు పడుతాయి. వాకింగ్‌ చేయడం వల్ల ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం....సమిష్టిగా వాకింగ్ చేయడం రండి..

మరింత సమాచారం తెలుసుకోండి: