కాలం మారుతోంది, మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కూడా తమ నిత్య కృత్యాలని పక్కన పెట్టేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ చెవిలో హెడ్ ఫోన్ తో ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ గడిపేస్తున్నారు. శరీరానికి శారీరక శ్రమ లేకుండా చేసుకుంటూ ఎన్నో రోగాలని కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో వ్యాయామానికి సమయం ఇవ్వడం చాలా మందికి కుదరక పోయినా కేవలం 5 నిమిషాల సమయం ఉంటే చాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

చాలా మంది వ్యాయామం అంటే సుదీర్గంగా నడవటం మొదలు పెడుతారు. నడక మంచిదే కాని నడకకంటే కూడా జాగింగ్ చేయడం ఇంకా మంచిదని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ జాగింగ్ శరీరంలో కొవ్వుని మరింతగా కరిగేలా చేస్తుందట. రన్నింగ్ చేయడం వలన శరీరం మొత్తం కదులుతుంది. అంతేకాదు బరువు పూర్తిగా తగ్గాలంటే 5 నిమిషాల సమయం సరిపోదు , కానీ గుండు కంటే బోడి గుండు నయం అన్నట్టుగా అసలు చేయక పోవడం కంటే ఎంతో కొంత మొదలు పెడితేనే మంచిది.

 

ఉదయాన్నీ జాగింగ్ చేయడం వలన సూర్యుని చల్లని కిరణాలు, చల్లని వాతావరం మనసుకి మానసిక ఆనందాన్ని కలిగించి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనసు ధృడంగా ఉండేలా చేస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవిల్స్ తగ్గకుండా, పెరగకుండా బ్యాలన్స్ చేస్తాయి. అసలు ఒంట్లో కి షుగర్ చేరకుండా ఉండాలంటే కేవలం 5 నిమిషాల జాగింగ్ చాలు అంటారు నిపుణులు.

 

చాలా మందికి మల బద్ధకం ఉంటుంది, నిద్ర సరిగా పట్టాడు, ముఖం వాడిపోయినట్టుగా, మొటిమలతో , చాలా చిరాకుగా ఉంటుంది. కండరాలు అన్నీ పట్టేసినట్టుగా ఎంతో నిస్సత్తువలో ఉండిపోతారు. అలాంటి వారు తప్పకుండా జాగింగ్ చేయడం వలన అన్ని సమస్యలకి ఒక్క జాగింగ్ తో చెక్ పెట్టేసినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: