సాధార‌ణంగా నెయ్యిని ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. అనేక ర‌కాల వంట‌ల్లో నెయ్యి వాడుతుంటారు. చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ్వ‌రైనా మ‌న‌సు కాదు.. కాదు.. నోరుపారేసుకుంటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి ఇలా అనేక ప‌దార్థాల‌తో నెయ్యిని క‌లుపుకుని తింటే.. ఆహా.. అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా. అయితే నెయ్యి తిన‌డ‌మే కాదు.. దీన్ని వ‌ల్ల ఉప‌యోగాలు ఏంటి? రోజుకు ఎంత తీసుకోవాలి? అన్న‌వి కూడా ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే అవసరానికి మించి వాడితే ఏదైనా సరే ఆరోగ్యానికి చేటు. నెయ్యి అధిక శక్తినిస్తుంది కాబట్టి తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రెండు లేదా మూడు టీ స్పూన్స్‌ నెయ్యి ఒక్కరోజుకి ఒక్క వ్యక్తి తీసుకోవచ్చు.

 

అలాగే నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌న చాలా మందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉదయం పరిగడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు దరి చేరవు. జీర్ణ పక్రియను వేగవంతం చేసి సమర్ధవంతంగా జరిగేలా చేస్తుంది. మ‌రియు గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి నెయ్యితో ఉపశమనం దొరుకుతుంది. గర్భిణీలకు నెయ్యిని కచ్చితంగా తీసుకోవాలి. దీనిలోని ఎన్నో పోషకాలు పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు సాయపడతాయి.

 

నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే త‌గ్గిపోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. అదే విధంగా ప్ర‌తి రోజు నెయ్యి తీసుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ కళ్లకు ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: