ఒక మహిళ గర్భవతిగా ఉన్నపుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో, డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. వాస్తవానికి  పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగడం చాలా ఆరోగ్యకరం అని వైద్యులు తెలియచేస్తూ ఉంటారు. ఇలా పసి పిల్లలకు పాలు పట్టడం వల్ల వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటే నమ్మండి. భవిష్యత్‌లోనూ కూడా పిల్లలు చాల బలంగా ఉంటారు. తల్లి పాలు పిల్లలకు చాలా ఆరోగ్యాన్ని. ప్రసాదిస్తుంది.  కానీ, రొమ్ము పాలు తాగడం వల్ల పిల్లలకి గుండెనొప్పులు రావు అని నిపుణులు తెలియచేస్తునారు.

 

Related image

 

తల్లి పాలు ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనది. ఇంకా  ఓ రకంగా చెప్పాలంటే అమ్మపాలు అమృతంతో సమానం అని చెప్పొచ్చు. మొదటిసారిగా పుట్టిన పసి బిడ్డకు  తల్లిపాలే ఇవ్వాలి. దీని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇలా తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి జబ్బులు రావు. తాజాగా పరిశోధకులు సరికొత్త విషయాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే.. తల్లి పాలు ఎక్కువగా తాగిన పిల్లలకు భవిష్యత్‌లో గుండె సమస్యలు రావు అని నిర్ధారించడం జరిగింది.

 

Image result for Benefits of Breastfeeding

 


మరి కొంతమంది పిల్లలు  తల్లి గర్భంలో ఉండాల్సిన సమయం కంటే ముందే పుడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలని ప్రీమెచ్యూర్ బెబీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి తల్లిపాలు ఇచ్చి పెంచడం వల్ల వారికి భవిష్యత్‌లో వారికి గుండె సమస్యలు రావు అని నిపుణులు తెలియచేస్తునారు. ఇక వాస్తవానికి  పరిశోధనల్లో తేలిన నిజాలు ఇవే.. ఐర్లాండ్‌లో ఇదే అంశంపై పరిశోధకులు కొన్ని రోజులుగా పరిశోధనలు నిర్వహించడం జరిగింది.

 

తల్లి గర్భంలో పూర్తి సమయంలో లేకుండా త్వరగా పుట్టే పిల్లలకు గుండెలు చాల చిన్నవిగా ఉంటాయి అని తేలింది. ఈ కారణంగా ఈ పిల్లలు పెరిగాక వారికి గుండె నొప్పులు వచ్చే అవకాశాలు చాల ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. అయితే, ఇలాంటి పిల్లలకి ఎక్కువగా తల్లి రొమ్ము పాలు పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ల వంటివి బాగా పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ కారణంగా వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం  వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: