చలికాలం వచ్చిందంటే చాలు చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ  అందరికీ జలుబు, దగ్గు వంటి సమస్యలు అధికంగా వాస్తు ఉంటాయి. ఇలా వచ్చిన  సమస్యలు అంటిని పెద్దవారు తట్టుకుంటారు కానీ, పిల్లలకు మాత్రం చాల కష్టం,  అంత సులువుగా సమస్య నుంచి బయటికి రారు. ఎవరికైనా సరే జలుబు వచ్చిందంటే చాలు సులువుగా తగ్గదు. జలుబు రావడం వల్ల ప్రతీ ఒక్కరూ చాలా ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటారు. ఇక పిల్లలు మాత్రం  ఈ సమస్యని భరించలేక ఏడుస్తు ఉంటారు. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని మందులు వేసినా పిల్లలకి త్వరగా జలుబు తగ్గదు అని బాగా అర్థం అవుతుంది. ఇలా  సమస్యలు వచ్చినప్పుడు  కొన్ని ఇంటి  చిట్కాల ద్వారా సమస్యను త్వరగా తగ్గించవచ్చు. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా మరి...

 


ఇక పిల్లలకి జలుబు వచ్చిందంటే చాలు ముక్కు బ్లాక్ అయి శ్వాస తీసుకునేందుకు చాల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లకి  ఆవిరి పట్టడం చాలా మంచిది. ఇలా ఆవిరి పట్టడం వల్ల పిల్లలకి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆవిరి పట్టడానికి చిటికెడు పసుపు, నీలగిరి తైలం మనకు కావాలి. ఇప్పుడు వచ్చే ఆవిర్లని పిల్లలకి పట్టించాలి. ఇలా చేేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు నుంచి ఉపశమనం  లభిస్తుంది. పిల్లలు  జలుబు  సమస్యతో బాధపడేటప్పుడు చాలా విశ్రాంతి అవసరం.

 


ఒక్క ఆవిరి పట్టడంతో పాటు పసుపు పాలు కూడా తాగించిందండి చాల మంచిది. పిల్లలకు రోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలల్లో పసుపు వేసి తాగించండి వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. దానితో పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఇక  ఎక్కువ వయసు  పిల్లలు ఐతే సెలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కుని క్లీన్ చేసుకొని జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇంకా వీటితో పాటు మీ పిల్లలకు అల్లం టీ, గోరువెచ్చని నీరు నిమ్మరసం, తులసి టీ వంటివి ఇచ్చి జలుబు సమస్య నుంచి  ఉపశమనం కలిగించండి.  ఇంకా  ఎందుకు ఆలస్యం ఈ చిట్కాలను పాటించి మీ పిల్లల సమస్య నుంచి ఉపశమనం  కలిగించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: