సాధార‌ణంగా టీని చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. ఎంత‌గా అంటే.. ప్రోద్దున్నే టీ తాగితే కానీ ఏ పని చేయలేం అన్నంత‌గా. ఇక ఈ కాలంలో మార్నింగ్‌.. మార్నింగ్ లేవ‌గానే ఓ సిప్ టీ తాగితే దానికి వ‌చ్చే కిక్కే వేరు. ఒత్తిడి సమయంలో ఓ కప్పు టీ తాగితే ఉపశమనం ల‌భిస్తుంది. అయితే టీ, కాఫీలు తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం. దీంతో టీకి దూరంగా ఉండెందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ అవ‌న్నీ అపోహ‌లు మాత్రమే. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే.  తలనొప్పిగా ఉన్న సమయంలో టీ చక్కగా పనిచేస్తుంది. అయితే టీ తాగేట‌ప్పుడు మీరు ఒక‌టి గ‌మ‌నించారా..? అదేనండీ… టీ మీద మీగ‌డ  పేరుకుపోతుంది చూశారా..? అవును, అదే. 

 

దాన్ని తీయ‌కుండానే తాగేస్తున్నారా..? అస‌లు అలా తాగ‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా..? తెలియ‌క‌పోతే ఇప్ప‌టికైనా తెలుసుకోండి. సహజంగా అలా చాయ్ మీద మీగడ పేరుకుపోవడమనేది అందులోని కలిపే పాల వల్ల వస్తుంది. పాలను వేడి చేసినప్పుడు అందులో ఉండే తేలికపాటి కొవ్వులు దాని మీద పొరలా వచ్చి మీగడలా పేరుకుంటాయి. ఆ క్రమంలో ఆ పాలతో ఛాయ్ పెడితే ఆ టీ కూడా మీగడ పొరలా వస్తుంది.  అయితే దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. 

 

వాస్త‌వానికి  పాల‌క‌న్నా మీగ‌డ‌లో దాదాపుగా 20 నుంచి 36 శాతం వ‌ర‌కు సాచురేటెడ్ ఫ్యాట్స్‌, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శ‌రీరానికి అవ‌స‌ర‌మే కానీ.. మోతాదుకు మించి తీసుకోవ‌డం మంచిది కాదు. మోతాదుకు మించి తీసుకోవ‌డం వ‌ల్ల అవి రక్త నాళాల్లో పేరుకుపోతాయి. దీంతో చెడు కొల‌స్ట్రాల్ పెరిగిపోయి.. మంచి కొల‌స్ట్రాల్ న‌శించిపోతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. సో.. టీ తాగే ముందు పేరుకున్న మీగ‌డ‌ను తీసి తాగ‌డం చాలా ఉత్త‌మం. 

మరింత సమాచారం తెలుసుకోండి: