పాలు తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని మద్యపానం తాగితే ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ శరీరానికి పాల కంటే బీరు ఎంతో మంచిదట. జంతు సంరక్షణ సంస్థ పెటా పాల కంటే బీరు మంచిదని ప్రకటన చేసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ సర్వే రిపోర్ట్ ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది. పెటా బీరు మంచిదనే విషయంలో ఎలాంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదని చెబుతోంది. 
 
పాల ఉత్పత్తులు, పాల వలన రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పెటా చెబుతోంది. పాలు, పాల ఉత్పత్తులు కేన్సర్, డయాబెటిస్,ఒబెసిటీ జబ్బులకు కారణమవుతాయని పాలు, పాల ఉత్పత్తులు ఎముకలను బలహీనంగా మార్చే ప్రమాదం కూడా ఉందని పెటా చెబుతోంది. పెటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్ పాలతో పోలిస్తే బీరు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. 
 
పెటా గతంలోనే బీరుకు మద్దతుగా ప్రచారం చేసింది. కానీ పెటా బీరుకు మద్దతుగా ప్రచారం చేయటంపై విమర్శలు రావటంతో వెనక్కు తగ్గింది. పెటా గాట్ బీర్ పేరుతో బీరు బలవర్ధక ఆహారమని అమెరికాలోని విక్సాన్సిన్ యూనివర్సిటీ- మాడిసన్ క్యాంపస్ సమీపంలో బోర్డును ఏర్పాటు చేసింది. పెటా బీరు పాల కంటే ఎంతో బెటర్ అని చెబుతోంది. బీరు తాగే వారిలో ఆయుష్షు పెరుగుతుందని, ఎముకలు ధృడంగా ఉంటాయని చెబుతోంది. 
 
బీరును అమితంగా ఇష్టపడేవారు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటన చేసినా బీరు తాగేవారు. ఇప్పుడు పెటా బీరు ఆరోగ్యానికి మంచిదని చేసిన ప్రకటనతో బీరు ప్రియులు యథేచ్ఛగా బీరు తాగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: