నేటి సమాజంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇది హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణంగా మారుతోంది. గతంలో అరవయ్యేళ్ల వయసు పైబడిన వారిలో గుండెపోటు ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం ఇరవై ఏళ్ల వారికీ గుండెపోటు వస్తోంది. మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఈ బాపతు ఏటా కోటి కేసులు నమోదవుతున్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మీరు గమనించారో లేదో చాలా సంధర్భాల్లో గుండె పోటు… రాత్రి 2 నుండి  2:30 మధ్య ఎక్కువగా వస్తుంది. మ‌రి ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే.. మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది. 

 

ఈ నియమానికి అనుగుణంగా  గుండె   రాత్రి 2 నుండి 2:30 లోపు  చాలా క్రీయాశీలకంగా  పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం అవుతుంది. అవసరానికి సరిపడ ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30  సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. అయితే ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది.

 

గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు చాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం ఇది. ఆ సమయంలో విపరీతమైన చెమట పడుతుంది. వాంతి వచ్చే భావన కలిగి ఉండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం కూడా జరుగుతుంది. కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటాయి. కాళ్ళు, చేతులు చల్లబడి, చల్లని భావన కలుగుతుంది. గుండె కొట్టుకోవడంలో ఆగి ఆగి కొట్టుకుంటున్నట్లు కొద్దిపాటి తేడా కనపడుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌న‌ప్పుడు వెంట‌నే జాగ్ర‌త ప‌డితే ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: